సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట భారీ అంచనాల మధ్య ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్ల తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా చివరగా గీత గోవిందంతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. సర్కారు వారి పాట పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రి రిలీజ్ బజ్ అయితే బాగానే కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదే సాగుతున్నాయి. కాకపోతే మహేష్ ఇటీవలి ట్రాక్ రికార్డు, ఇతర సానుకూలతల్ని బట్టి చూస్తే ఇంకా జోష్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాక కొంత స్తబ్ధత నెలకొన్న మాట వాస్తవం. కాబట్టి కొంచెం జోరు తగ్గడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఐతే తెలుగు రాష్ట్రాల అవతల సర్కారు వారి పాట విషయంలో సందడే కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మామూలుగా మహేష్ సినిమాలు రిలీజవుతుంటే బాగా హడావుడి ఉంటుంది. తెలుగు వెర్షన్‌కే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. కానీ సర్కారు వారి పాట విషయంలో అలా జరగడం లేదు. రిలీజ్ ముందు రోజు కూడా బుక్ మై షోలో పచ్చ రంగే కనిపిస్తోంది. సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ట్రెండ్సే కనిపించడం లేదు. చాలా తక్కువ షోలకే ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి.
ఇండియాలో మిగతా సిటీల్లో కూడా సర్కారు వారి పాట సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఓవర్సీస్‌లో కూడా మామూలుగా మహేష్ సినిమాలకు కనిపించే హంగామా ఈ చిత్రానికి లేదని బుకింగ్స్, ఇతర అంశాలను బట్టి అర్థమవుతోంది. ఐతే ఇది మహేష్ సినిమా సమస్యగా చూడలేం. ఓవరాల్‌గా బాక్సాఫీస్ పరిస్థితే అలా ఉంది. రెండు వారాల కిందట వచ్చిన ఆచార్యకు అంత దారుణమైన ఫలితం రావడానికి కూడా ఇదే కారణం.
This post was last modified on May 11, 2022 7:15 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…