తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘటికుడు’ సినిమా చూశారా? అందులో ఆ చిత్ర బృందం ఒక ప్రయోగం చేసింది. సూర్య చిన్నప్పటి పాత్రకు చిన్న పిల్లాడెవరినీ తీసుకోకుండా.. సూర్యనే చూపించారందులో. సూర్యకు మీసం తీసేసి.. అతడి ముఖాన్నే చిన్న పిల్లాడి లాగా వీఎఫ్ఎక్స్ ద్వారా మార్చి అతణ్నో టీనేజీ కుర్రాడిగా మార్చారు. ఐతే అలా చూపించిన సన్నివేశాలు చాలా కృతకంగా అనిపించి ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి.
యూట్యూబ్‌లోకి వెళ్లి ఇప్పుడు ఆ సన్నివేశాలు చూసినా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాకు కూడా ఇలాంటి ప్రయోగమే చేయగా.. అది బెడిసికొట్టేసింది. ఈ చిత్రంలో చిరంజీవిని యువకుడిగా చూపించాల్సిన అవసరం పడింది ఓ సన్నివేశంలో. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఆ సీన్లో చిరుకు కుర్రాడిలా మేకప్ వేసి మేనేజ్ చేయాల్సిందేమో. లేదా ఆ సన్నివేశంలో చిరు లేనట్లుగా చూపించాల్సింది. కానీ కొరటాల ఆ ప్రయత్నం చేయలేదు.
చిరు కెరీర్ తొలి నాళ్లలోని ఒక ఫొటో బయటికి తీసి వీఎఫ్ఎక్స్ ద్వారా ఆ లుక్‌తోనే చిరు హావభావాలు పలికిస్తున్నట్లు చూపించాడు. ఐతే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా బెడిసి కొట్టేశాయి. చాలా కృత్రిమంగా, కృతకంగా అనిపించిందా సన్నివేశం. చిరును అలా చూడలేకపోయారు అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సన్నివేశం ముగుస్తుందా అనిపించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అసలే సినిమాకు నెగెటివ్ టాక్ రాగా.. దీనికి తోడు ఇలాంటి సన్నివేశం ఉండటంతో సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? అప్పుడే ఈ సన్నివేశం ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది. చాలామంది యాంటీ ఫ్యాన్స్ ఆ సన్నివేశంలో చిరు లుక్‌ను డీపీగా మార్చేసుకున్నారు. కొన్నిసార్లు చిన్న సన్నివేశాలే సినిమాకు చాలా చేటు చేస్తుంటాయి. ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీని పెంచుతాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే అని చెప్పాలి. ఈ సీన్ మెగా అభిమానులను చాలా కాలం వెంటాడేలా కనిపిస్తోంది.
This post was last modified on April 29, 2022 8:01 pm
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు…
బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు…
టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ…
మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో…