సినిమా థియేటర్లు మూసి వేసి ఉంచడంతో ఒక మాదిరి సినిమాలను ఓటిటీ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంత వరకు ఓటిటీ ద్వారా బయటకు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. పేరుకి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి కానీ ‘భలే ఉంది’ అనిపించేది మాత్రం ఏదీ రాలేదు. గులాబో సితాబో, పెంగ్విన్ సినిమాల తర్వాత ఇలా విడుదలయ్యే సినిమాల్లో విషయం ఉండదనే ఫీలింగ్ బలపడిపోయింది.
సినిమా బాగుంటే థియేటర్లో విడుదల చేసుకునే వరకు వేచి చూసే వాళ్ళు కదా, బాగోలేదని తెలిసే ఇలా వదిలించేసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సుఫియుమ్ సుజాతయుమ్ జజులై 3న అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతోంది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రియుల ఆదరణ చూరగొంటే బాగుంటుంది. లేదా విషయం లేని సినిమాలే ఇలా విడుదల అవుతాయనే భావన బలపడి, కొత్త సినిమాలు కొనడానికి ఓటిటీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates