సౌత్ సినిమాల్లోనే అత్యుత్తమ హీరో విలన్ క్లాష్ గా చెప్పుకునే నరసింహ సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణల పోటాపోటీ నటన ఎన్ని దశాబ్దాలు గడిచినా మర్చిపోవడం కష్టం. లేడీ విలన్ ని ఇలా కూడా ఎలివేట్ చేయొచ్చా అనే రీతిలో కథకుడు చిన్నికృష్ణ దర్శకుడు కెఎస్ రవికుమార్ చూపించిన తీరుకి ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే. అందుకే ఎప్పుడు ఈ మూవీ టీవీలో వచ్చినా ఛానల్ మార్చడం కష్టం. అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది.
హీరోయిన్ సౌందర్య కంటే రమ్యకృష్ణకే ఎక్కువ పేరు రావడం న్యాయమే. ఇప్పుడీ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని కోలీవుడ్ టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ప్రధానమైన పాత్రకు రమ్యకృష్ణనే లాక్ చేసినట్టు సమాచారం. అందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయట.
ఇంకేముంది మరోసారి నరసింహ నీలాంబరిలు పరస్పరం ఛాలెంజ్ చేసుకునే సూపర్ డ్రామాని చూడొచ్చన్న మాట. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. దీని అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. గత కొనేళ్లుగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోల్పోయిన రజనీకాంత్ బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.
విజయ్ తో బీస్ట్ రూపంలో ఫ్లాప్ తో విమర్శలనూ మూటగట్టుకున్న నెల్సన్ కు సైతం ఇది హిట్ కావడం చాలా అవసరం. క్యాస్టింగ్ కూడా గట్టిగానే సెట్ చేసుకుంటున్నారు. ఇంత వయసులోనూ విపరీతంగా కష్టపడుతున్న రజనికి ఇదే సన్ పిక్చర్స్ నిర్మించిన పెద్దన్న అనుభవం గట్టి షాకే ఇచ్చింది. మరి నెల్సనైనా సరిగా వాడుకుంటాడా లేక పేట, కాలా దర్శకుల్లా తడబడతాడా వేచి చూడాలి.
This post was last modified on April 28, 2022 3:48 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…