సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అవుతుంటే అది చేయడానికి కొందరు చోటా మోటా సెలెబ్రిటీలు ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ సోషల్ మీడియాలో పిల్లకాయలు హల్చల్ చేస్తున్నారు. చైనా టీవీలను, మొబైల్ ఫోన్స్ పగలగొట్టడం, ఆ వీడియోలు పెట్టడం ఇప్పుడు వైరల్ ట్రెండ్. ఇందులో తాను కూడా ఉన్నా అంటూ తనదగ్గర ఉన్న చైనా ఫోన్ ని నేలకేసి కొట్టి, దానిని డస్ట్ బిన్ లో వేసిన వీడియోను పోస్ట్ చేసాడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్.
చైనాకు నష్టం చేయడం అంటే పాతవి పగలగొట్టుకోవడం కాదని, కొత్తవి కొనకుండా ఉండడం అనే మినిమం కామన్ సెన్స్ లేదంటూ కౌశల్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి లాజిక్స్ టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేసే వారికి అర్థం కాదు.
కౌశల్ లాంటి చిన్న సెలెబ్రిటీలు అలాంటి వేలం వెర్రి ఉన్న పిల్లల్ని ఆకట్టుకోడానికి తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు వీడియోలు పెట్టేస్తుంటారు. కాకపోతే సెన్సిబుల్ జనాల దృష్టిలో చులకన అయిపోతుంటారు.