Movie News

తమిళ ఇండస్ట్రీ  ఏడుపు.. గడ్డి పెట్టిన మణిరత్నం

ఒకప్పుడు సౌత్ ఇండియాలో తమిళ చిత్రాల ఆధిపత్యం ఎలా సాగిందో తెలిసిందే. ముందుగా కమల్ హాసన్, ఆ తర్వాత రజినీకాంత్ తెలుగులో భారీ విజయాలందుకున్నారు. ఆ తర్వాత సూర్య, విశాల్, కార్తి, జీవా లాంటి హీరోలు కూడా ఇక్కడ ఆధిపత్యం చలాయించారు. ఒక టైంలో తమిళ అనువాద చిత్రాలకు భయపడి మన చిత్రాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు ఆ ట్రెండును తమిళ హీరోలు, దర్శకులు, నిర్మాతలు బాగా ఎంజాయ్ చేశారు.

ఇక్కడ మార్కెట్ ఇంకా ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఐతే తమిళ చిత్రాలు టాప్ లెవెల్లో ఉన్నంత కాలం.. అక్కడి ప్రేక్షకులు వేరే భాషా చిత్రాలను తమిళంలోకి రానివ్వలేదు. డబ్బింగ్ సినిమాలేవీ అక్కడ ఆడేవి కావు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తమిళ చిత్రాల క్వాలిటీ పడిపోయింది. అదే సమయంలో తెలుగు సినిమాల జోరు పెరిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తమిళనాట బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

ఇప్పుడు కన్నడ అనువాద చిత్రం ‘కేజీఎఫ్-2’ కోలీవుడ్ బాక్సాఫీస్‌లో ప్రకంపనలు రేపింది. దీని ధాటికి విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమా ‘బీస్ట్’ కుదేలైంది. ‘బీస్ట్’ సినిమాను తొలి వీకెండ్లోనే ‘కేజీఎఫ్-2’తో రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వీకెండ్ తర్వాత విజయ్ సినిమా పూర్తిగా చతికిలపడింది. ఐతే ఈ పరిణామం తమిళ ఇండస్ట్రీ జనాలకు రుచించడం లేదు. మన సినిమాల మీద వేరే చిత్రాల పెత్తనం ఏంటి అంటూ ఉడికిపోతున్నారు. కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు కూడా.

ఐతే అలాంటి వాళ్లకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సున్నితంగానే గడ్డి పెట్టారు. ఒక భాషకు చెందిన సినిమా ఇంకో భాషలో ఆడటం కొత్త కాదని.. తమిళనాట కూడా వేరే భాషా చిత్రాలను ఆదరించడం 70-80 ఏళ్ల కిందటే జరిగిందని, ఇదేమీ కొత్త కాదని.. మన సినిమాలు కూడా వేరే భాషల్లో బాగా ఆడాయని.. ‘కేజీఎఫ్-2’కు తమిళంలో ఆదరణ దక్కడం మంచి విషయమే అని మణిరత్నం వ్యాఖ్యానించారు. తమిళంలో గొప్ప టాలెంట్ ఉందని, వారిపై తనకు నమ్మకం ఉందని, తమిళ సినిమాను వారు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on April 27, 2022 4:25 pm

Share

Recent Posts

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

60 minutes ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

10 hours ago