ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద వాడైన ఆర్యన్ రాజేష్‌ను హీరోగా నిలబెట్టాలని, చిన్న వాడైన నరేష్‌ను దర్శకుడిగా చూడాలని ఆశపడ్డారు. ఆ దిశగానే ‘హాయ్’ సినిమాతో ఆర్యన్‌ను హీరోగా గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. ఆ తర్వాత కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేశాడు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈలోపు తండ్రి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసి అనుకోకుండా ‘అల్లరి’ సినిమాతో హీరోగా మారిన నరేష్.. ఆ సినిమా సక్సెస్ అవడంతో కామెడీ హీరోగా సెటిలైపోయాడు.
ఒక దశలో మంచి డిమాండ్ సంపాదించాడు. తర్వాత తడబడ్డప్పటికీ.. ఇప్పుడతడి కెరీర్ పర్వాలేదు. ఆర్యన్ అయితే పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే కనిపించాడు. ఆ మధ్య ‘వినయ విధేయ రామ’లో చరణ్ సోదరుడి పాత్రలో కనిపించిన ఆర్యన్.. తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. ఐతే ఇప్పుడు ఆర్యన్ హీరోగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుండటం విశేషం.
‘హలో వరల్డ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నది మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక కావడం గమనార్హం. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బేనర్ మీద ఈ వెబ్ సిరీస్‌ను నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ‘జయం’ ఫేమ్, సీనియర్ హీరోయిన్ సదా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. నిత్యాశెట్టి, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శివసాయి వర్ధన్ అనే కొత్త దర్శకుడు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. ఈ మధ్య పబ్ గొడవతో నిహారిక పేరు అనవసరంగా వార్తల్లో నానింది. ఈ అన్ వాంటెడ్ పాపులారిటీతో నిహారిక బాగా ఇబ్బంది పడింది. అంతకంటే ముందు చైతన్యతో నిహారికకు అభిప్రాయ విబేదాలంటూ ఓ ప్రచారం నడిచింది. ఐతే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, నిహారిక కూడా హుషారుగా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
This post was last modified on April 26, 2022 10:41 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…