‘భరత్ అనే నేను’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కోసం కొరటాల శివ ఓ కథ సిద్దం చేసుకున్నాడు. చరణ్ తో ఓ యాక్షన్ డ్రామా చేయాలని భావించారు. కానీ అప్పటికే రామ్ చరణ్ రాజమౌళి RRR అడిగినన్ని డేట్స్ ఇచ్చేశాడు. దీంతో తమ కాంబో సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రాజమౌళి సినిమాలో జాయిన్ అవ్వాలనుకున్నాడు మెగా పవర్ స్టార్.
కానీ అందుకు కొరటాల ఒప్పుకోలేదు. తక్కువ డేట్స్ తో ఏదో హడావుడిగా ఓ సినిమా తీయడం తన వల్ల కాదని రాజమౌళి గారి ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏమిటో తనకి తెలుసనీ పైగా తారక్ , చరణ్ కాంబో అంటే తను కూడా ఓ సినిమా అభిమానిగా స్క్రీన్ పై చూడాలనుకుంటున్నానని చరణ్ కి చెప్పేసి మరో హీరోకి కథ చెప్పే ప్లాన్ చేసుకున్నాడు కొరటాల.
కానీ చరణ్ చిరుతో డిస్కస్ చేసి కొరటాల శివకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెగాస్టార్ తో సినిమా చేయమని , మెగా ప్రాజెక్ట్ కొరటాల చేతిలో పెట్టాడు చరణ్.
దీంతో అప్పటి కప్పుడు ఆచార్య కథ తాయారు చేసుకొని చిరుకి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు శివ. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ అనుకోకుండా సినిమాలో ఓ ఇంపార్టెన్స్ రోల్ వచ్చింది. ఆ కేరెక్టర్ కి కథలో స్పేస్ ఉండటంతో ఎవరితో చేయించాలని తర్జనభర్జన పడ్డారు. రామ్ చరణ్ తోనే ఆ రోల్ చేయించాలనేది అందరి కోరిక. కానీ జక్కన్న చరణ్ ని విడిచిపెట్టరు ఇది కన్ఫర్మ్. అందుకే మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. చరణ్ మిస్ అయితే మహేష్ ఫిక్స్ అనుకున్నారు టీం.
ఎట్టకేలకు రాజమౌళి ని కన్విన్స్ చేసి చరణ్ ని ‘ఆచార్య’ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ చరణ్ ఎంట్రీ ఇచ్చాక కేరెక్టర్ ఇంపార్టెన్స్ తో పాటు మరో ముప్పై నిమిషాల నిడివి పెరిగింది. అవును ముందుగా చరణ్ రోల్ 15 నిమిషాలే అనుకున్నారు. కానీ దాన్ని పెంచి ఇప్పుడు ఫైనల్ గా 45 నిమిషాలు లాక్ చేసి కథలో భాగం చేశారు. సో ఇప్పుడు చరణ్ సినిమాలో నలబై నిమిషాల పాటు కనిపించనున్నాడు. మొదటి భాగంతో పాటు సెకండాఫ్ లో కూడా ఉంటాడు. మరి చిరుతో కలిసి నలబై ఐదు నిమిషాల నిడివి గల పాత్రతో చరణ్ ఎలా మెప్పిస్తాడో ? చూడాలి.