హిందీ ‘జెర్సీ’ మీద చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నారు. తెలుగులో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి షాహిద్ కపూర్ ఆసక్తి చూపిస్తే.. దేశం మొత్తాన్ని ఈ కథ బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో దిల్ రాజు, నాగ వంశీ, అల్లు అరవింద్ ముగ్గురూ హిందీ రీమేక్‌లో భాగం అయ్యారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్‌తో కలిసి దీన్ని హిందీలో పునర్నిర్మించారు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో భారీ విజయాన్నందుకున్న షాహిద్.. ఈ చిత్రం కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందని, తన స్టార్ ఇమేజ్‌ను, మార్కెట్‌ను పెంచుతుందని నమ్మాడు. పెద్ద సక్సెస్ కోసం చూస్తున్న మృణాల్ ఠాకూర్‌కు కూడా ఈ చిత్రం మలుపు అవుతుందని భావించారు. ఇక ఈ సినిమాతోనే హిందీలోకి అడుగు పెట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా తనకు బాలీవుడ్లో పెద్ద బ్రేక్ వస్తుందని అనుకున్నాడు.
కానీ వీళ్లందరి ఆశలు అడియాసలు అయినట్లే కనిపిస్తోంది. హిందీ ‘జెర్సీ’కి ఓవరాల్‌గా మంచి టాకే వచ్చినా.. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గానే నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. తొలి రోజు రూ.4 కోట్ల నెట్ వసూళ్లతో మొదలైన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో రూ.10 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. వీకెండ్లోనే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. తొలి రోజుతో పోలిస్తే తర్వాతి రెండు రోజుల్లో వసూళ్లు కాస్త మెరుగైనా.. ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడితో పోలిస్తే వీకెండ్లో వచ్చింది చాలా తక్కువే.
ఫస్ట్ వీకెండ్ వసూళ్లు సినిమా సక్సెస్‌లో చాలా కీలకంగా మారుతున్న ఈ రోజుల్లో ‘జెర్సీ’ అండర్ పెర్ఫామ్ చేసింది. వీకెండ్ తర్వాత వసూళ్లు ఆటోమేటిగ్గా డ్రాప్ అవడం లాంఛనమే. మళ్లీ ఈ వీకెండ్లో సినిమా ఏమేర పుంజుకుంటుందో అన్న సందేహాలున్నాయి. ‘కేజీఎఫ్-2’ దూకుడు రెండో వారంలోనూ కొనసాగుతోంది. దాని పోటీని తట్టుకోవడం ‘జెర్సీ’ వల్ల కావట్లేదు. పైగా ఈ వారం అజయ్ దేవగణ్ సినిమా ‘రన్ వే 34’ రిలీజవుతోంది. కాబట్టి సెకండ్ వీకెండ్ మీద పెద్దగా ఆశల్లేవు. చూస్తుంటే బాక్సాఫీస్ లెక్కల్లో ‘జెర్సీ’ డిజాస్టర్ అనిపించుకునేలా ఉంది.
This post was last modified on April 25, 2022 10:56 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…