Movie News

మన దర్శకుడికి ముంబయిలో స్టాండింగ్ ఒవేషన్

సుమంత్ అనే ఫాంలో లేని హీరోతో తక్కువ బడ్జెట్లో ‘మళ్ళీ రావా’ అనే సినిమా తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలన్నట్లు.. ఆ సినిమా చూసి గౌతమ్ ప్రతిభ ఏంటో అందరూ అర్థం చేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని లాంటి పేరున్న హీరోతో.. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో తన రెండో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు గౌతమ్.

ఈ కాంబినేషన్లో వచ్చిన ‘జెర్సీ’కి ఎన్ని ప్రశంసలు వచ్చాయో తెలిసిందే. కమర్షియల్‌గా ఓ మోస్తరు విజయాన్నే అందుకున్నప్పటికీ.. తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనే స్థాయిలో ‘జెర్సీ’కి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం వెంటనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. షాహిద్ కపూర్ లాంటి పెద్ద హీరోతో గౌతమ్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు. అక్కడా ‘జెర్సీ’ పేరుతోనే సినిమా పునర్నిర్మితమైంది. కరోనా, ఇతర కారణాలతో రిలీజ్ చాలా ఆలస్యమైది కానీ.. ‘జెర్సీ’ ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది.

‘కేజీఎఫ్-2’ దూకుడు కొనసాగుతున్నప్పటికీ ఈ శుక్రవారం ‘జెర్సీ’ని ధైర్యంగా రిలీజ్ చేసేశారు. విడుదల ముంగిట ఈ చిత్రానికి సెలబ్రెటీలతో స్పెషల్ ప్రిమియర్స్ వేశారు ముంబయిలో. అందులో సినిమా చూసిన వాళ్లందరూ ముగ్ధులైపోయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది సినిమాను కొనియాడుతూ.. గౌతమ్, షాహిద్‌లపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఇవేమీ బలవంతపు, మొక్కుబడి ట్వీట్లలా లేవు.

అందరూ మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తున్నట్లున్నారు. కాగా ఈ ప్రిమియర్ వేసిన థియేటర్లో షో అయ్యాక తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రోలింగ్ టైటిల్స్ పడేటపుడు గౌతమ్‌కు ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, అతడిని ప్రశంసల్లో ముంచెత్తడం విశేషం. చూస్తుంటే బాలీవుడ్లో అరంగేట్రంలోనే గౌతమ్ హాట్ టాపిక్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే ‘కేజీఎఫ్-2’ ప్రభంజనాన్ని తట్టుకుని బాక్సాపీస్ దగ్గర ఈ చిత్రం ఎలాంటి ఫలితం రాబడుతుందన్నదే కీలకం.

This post was last modified on April 22, 2022 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

4 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

6 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

7 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

8 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

9 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

10 hours ago