సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ గప్ చుప్!

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఎందుకు చనిపోయాడనేది మిస్టరీగానే ఉంది. ఎలాంటి సూసైడ్ నోట్ పెట్టకుండా ఉరి వేసుకుని మరణించిన సుషాంత్ ఆత్మహత్యకు కారణాలను పోలీస్ అన్వేషిస్తున్నారు. అయితే అతని మరణానికి సోషల్ మీడియా ట్రోల్స్ పలువురిని బాధ్యులుగా చూపిస్తున్నారు. వారిలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా ఉంది.

తెలుగులో తూనీగ తూనీగ అనే చిత్రంలో నటించిన రియా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఆమె ప్రవర్తన కూడా సుషాంత్ మనస్తాపానికి కారణం అంటూ ఆమెపై కూడా ఎవరో కేసు వేశారు. అలాగే ఆమె ఆలియా తండ్రి మహేష్ భట్ తో దిగిన ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు పోలీస్ ని కలిసి తన స్టేట్మెంట్ రికార్డు చేసిన రియా తన ప్రియుడి మరణం తర్వాత సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంటోంది. కనీసం సుషాంత్ గురించి ఆమె ఒక పోస్ట్ కూడా వేయలేదు. మీడియా తనను కాంటాక్ట్ చేయడానికి చూస్తున్నా కానీ రియా వారిని దూరం పెడుతోంది. ఆమె పెదవి విప్పితే ఈ సస్పెన్స్ కాస్తయినా వీడుతుందని సుషాంత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.