మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ముందుగా ఈ ఈవెంట్‌ను విజయవాడలో చేయబోతున్నారని, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరిగింది. ఇది మెగా అభిమానులకే మింగుడు పడలేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం మీద రాజకీయంగా పోరాడుతుంటే.. మరోవైపు ఆయన అన్నయ్య జగన్‌తో సన్నిహితంగా మెలిగితే జనసేనానికి ఇబ్బంది కదా అనే చర్చ నడిచింది.
ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఎంత వరకు నిజమో ఏమో కానీ.. తర్వాత అయితే ఇది జరగడం లేదని తేలింది. జనాల స్పందన చూశాక వెనక్కి తగ్గారో, లేక ముందు నుంచే ఆ ఆలోచన లేదో తెలియదు కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయితే మారిపోయింది. హైదరాబాద్‌లోనే ఈ వేడుక చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడిక ‘ఆచార్య’ ఈవెంట్‌కు ముఖ్య అతిథులు ఎవరన్న విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌నే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పిలవాలని చిరు నిర్ణయించుకున్నారట. చిరు-చరణ్ కలిసి నటిస్తున్న తొలి పూర్తి స్థాయి చిత్రమిదే. ఇలాంటి సినిమా వేడుకలో పవన్ పాల్గొంటే బాగుంటుందని చిరు భావించినట్లున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా మరో అతిథిగా వస్తారని సమాచారం.
ఈ మేరకు ఇప్పుడు జోరుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుండగా.. దానికి ఆరు రోజుల ముందు, అంటే 23న ఈ ఈవెంట్ చేయబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు, చరణ్‌లకు జోడీగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 19, 2022 5:57 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…