Movie News

కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫొటోలు వైర‌ల్


కేజీఎఫ్‌-2తో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. మూడున్న‌రేళ్ల కింద‌ట కేజీఎఫ్‌-చాప్ట‌ర్ 1తోనే అత‌ను హాట్ టాపిక్ అయ్యాడు. మీడియం రేంజ్ హీరోను పెట్టి ఒక సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు, ఓ మోస్త‌రు బ‌డ్జెట్లో అలాంటి సినిమా తీయ‌డం.. అంత పెద్ద హిట్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. విశేషం ఏంటంటే.. హీరో, ద‌ర్శ‌కుల్లాగే ఈ సినిమాకు ప‌ని చేసిన సాంకేతిక నిపుణులు కూడా అంత పేరున్న వాళ్లేమీ కాదు. వాళ్ల నేప‌థ్యం కూడా సాధార‌ణ‌మైందే.

కేజీఎఫ్‌-2కు కేవ‌లం 19 ఏళ్ల వ‌య‌సున్న ఉజ్వ‌ల్ అనే కుర్రాడు ఎడిటింగ్ చేశాడ‌ని, అత‌ను అంత‌కుముందు షార్ట్ ఫిలిమ్స్‌, ఫ్యాన్ మేడ్ వీడియోల‌కు ఎడిటింగ్ చేసేవాడ‌ని తెలిసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఈ చిత్ర ఛాయాగ్ర‌హ‌కుడైన భువ‌న్ గౌడ ఏమో ఒక స్టిల్ ఫొటోగ్రాఫ‌ర‌ట‌. ఇప్పుడు ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. అది సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బ‌స్రూర్‌కు సంబంధించిన‌ది.

ర‌వి బ‌స్రూర్ తండ్రి గోల్డ్ స్మిత్ (బంగారం ప‌ని చేసే కార్మికుడు). వీరిది చాలా సాధార‌ణ కుటుంబం. ర‌వి సినిమాల్లోకి రావ‌డానికి ముందు, వ‌చ్చాక కూడా తండ్రికి సాయంగా త‌మ వార‌స‌త్వంగా వ‌స్తున్న ప‌ని చేసేవాడు. అత‌డి తండ్రి ఇప్ప‌టికీ అదే ప‌నిని కొన‌సాగిస్తున్నాడు. క‌రోనా లాక్ డౌన్ టైంలో ఇబ్బంది ప‌డుతున్న తండ్రికి సాయంగా ర‌వి కొలిమిలో బంగారాన్ని కాల్చి ఆభ‌ర‌ణాలు త‌యారు చేశాడ‌ట‌. సంబంధిత ఫొటోలు కొన్ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడిగా నిల‌దొక్కుకోవ‌డానికి ముందు ర‌వి ప‌డ్డ క‌ష్టాల గురించి తెలిసిన వాళ్లు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతున్నారు. కేజీఎఫ్‌-1 సినిమాతోనే ర‌వి త‌న నేప‌థ్య సంగీతం, పాట‌ల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. చాప్ట‌ర్-2తో అత‌డి ఆర్ఆర్ మ‌రింత‌గా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ల‌ను గుర్తించి ఇంత మంచి ఔట్ పుట్ రాబ‌ట్టుకున్న ప్ర‌శాంత్‌ను ఎంత పొగిడినా త‌క్కువే.

This post was last modified on April 18, 2022 8:29 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

4 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

6 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

6 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

6 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

10 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

10 hours ago