జెంటిల్‌మ్యాన్.. 90వ దశకంలో దక్షిణాదిన సంచలనం రేపిన సినిమా. అర్జున్ కథానాయకుడిగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయి శంకర్ పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్టయింది. తర్వాత అది చిరంజీవి హీరోగా బాలీవుడ్లోనూ రీమేక్ అయి అక్కడా బాగానే ఆడింది. ఆ తర్వాత శంకర్ ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించిన కేటీ కుంజుమోన్ కూడా చాలా పెద్ద రేంజికి వెళ్లాడు. ఆ తర్వాత మరెన్ని భారీ చిత్రాలను రూపొందించాడు.
ఐతే ‘రక్షకుడు’ సినిమాకు నేలవిడిచి సాము చేయడంతో ఆయన నిర్మాణ సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాన్నుంచి ఆయన కోలుకోలేక ఒక దశ దాటాక ప్రొడక్షనే ఆపేశాడు. ఐతే చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉన్న కుంజుమోన్.. ఈ మధ్య మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘జెంటిల్‌మ్యాన్-2’ తీయబోతున్నట్లు ప్రకటించాడు.
ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికైనట్లు ప్రకటించడంతో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు కుంజుమోన్. ఐతే ఈ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తే ఏంటి.. అసలు హీరో ఎవరు, దర్శకుడెవరు అన్న ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి ఎదురయ్యాయి. కానీ ఆయన వాటికి సమాధానం ఇవ్వలేదు. తర్వాతేమో ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయిక అన్నాడు. తర్వాతైనా హీరో, డైరెక్టర్ గురించి చెబుతాడనుకుంటే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఈ చిత్రంలో ప్రియా లాల్ అనే కొత్తమ్మాయి ఇంకో హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఈ అప్‌డేట్లేవీ కూడా ప్రేక్షకులను ఎగ్జైట్ చేయట్లేదు.
ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ముందు అదే హీరో చేస్తాడా.. అదే దర్శకుడు రూపొందిస్తాడా అనే చూస్తారు జనాలు. వేరే వాళ్లు ఎవరైనా టేకప్ చేసినా.. వాళ్లూ పేరున్న వాళ్లే అయ్యుండాలి. అప్పుడే సీక్వెల్‌కు క్రేజ్ వస్తుంది. ఆ సంగతేంటో తేల్చకుండా సంగీత దర్శకుడు, హీరోయిన్లను ప్రకటించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఇదంతా ఒక తమాషాలాగా అనిపిస్తోంది జనాలకు. మరి కుంజుమోన్ అసలు విషయాలు ఎప్పుడు వెల్లడిస్తాడో?
This post was last modified on April 14, 2022 10:21 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…