పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే బేసిగ్గా పవన్‌కు ఉండే క్రేజే ఆయన సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేస్తుంటుంది. అలాంటిది పవన్ మిగతా హీరోల్లాగా తన చిత్రాలను ప్రమోట్ చేస్తే.. ఎప్పటికప్పుడు అభిమానులకు పవన్ సినిమాల అప్‌డేట్స్ ఇస్తూ, మేకింగ్ వీడియోల్లాంటివి వదులుతూ ఊరిస్తుంటే ఇక ఆ సినిమాకు ఎంత హైప్ వస్తుందో చెప్పేదేముంది? ఇన్నాళ్లూ చూడని ఈ చిత్రమే ఇప్పుడు చూస్తున్నారు అభిమానులు.
ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడ్డ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి తరహా భారీ కథాంశంతోనే సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలపకపోవడం వల్ల అనుకున్నంత హైప్ రాలేదు. ఏడాది కిందట ఒక టీజర్ వదిలారు. ఆ తర్వాత ఏ ముచ్చటా లేదు.
అసలు షూటింగ్ గురించి కూడా సమాచారం లేదు. ఐతే చాన్నాళ్ల విరామం తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతూ.. లొకేషన్లో పవన్ ట్రైన్ అవుతున్న ఫొటోలు కొన్ని వదిలిన టీం.. ఈ ప్రిపరేషన్ తాలూకు వీడియో ఒకటి వదిలింది. అది కాసేపటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది. సినిమా మీద ఉన్నట్లుండి హైప్ పెరిగిపోయేలా చేసింది. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చేశాయి. ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాల మీద పవన్ చాలా ఫోకస్ పెట్టేవాడు.
వాటి కోసం ఎంతో కష్టపడేవాడు. గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. ఏదో మొక్కుబడిగా షూటింగ్‌కు వచ్చి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ప్రిపరేషన్లు గట్రా ఏమీ ఉండట్లేదు. యాక్షన్ ఘట్టాల మీద శ్రద్ధ కనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు కోసం మాత్రం ఒకప్పటి స్థాయిలో కష్టపడి యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చేలా చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ప్రమోషన్ల మీద కూడా టీం ఫోకస్ పెట్టడంతో సినిమాకు మంచి హైప్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 11:30 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…