ఉపేంద్ర.. ఈ పేరు వింటే ఒకప్పుడు తెలుగు యువత వెర్రెత్తిపోయేది. ఎ, ఉపేంద్ర లాంటి చిత్రాలతో 90వ దశకంలో అతను మామూలు సంచలనం రేపలేదు. ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా యువతలో ఆదరణ సంపాదించుకున్నాడు. ఈ డబ్బింగ్ చిత్రాల తర్వాత తెలుగులో నేరుగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అవి అంత బాగా ఏమీ ఆడకపోవడంతో తెలుగు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
ఉపేంద్ర డబ్బింగ్ సినిమాల జోరు కూడా తగ్గింది. సూపర్ అనే ఒక సినిమా మినహాయిస్తే ఇంకేదీ తెలుగులో ఆడలేదు. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తితో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రంలో కీలక పాత్ర చేసిన అతడికి సరైన ఫలితం దక్కలేదు. ఆ సినిమానే కాక, ఉపేంద్ర పాత్ర కూడా ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో మెప్పంచలేకపోయింది. దీంతో మళ్లీ బ్రేక్ వచ్చింది.
మళ్లీ ఇన్నేళ్లకు గని సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేశాడు.
విక్రమాదిత్య అనే హీరో తండ్రి పాత్ర అతడిది. లేక లేక ఉపేంద్ర తెలుగులో ఓ సినిమా చేయడంతో కచ్చితంగా అది చాలా స్పెషల్ అయ్యుంటుందని అనుకున్నారంతా. కానీ శుక్రవారం రిలీజైన ఈ సినిమా చూసిన వాళ్లంతా ఉసూరుమన్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోగా.. ఉపేంద్ర పాత్ర మరీ పేలవంగా తయారైంది.
ఫ్లాష్ బ్యాక్‌లో 20 నిమిషాల పైనే ఈ పాత్ర ఉంటుంది కానీ.. ఒక్కసారి కూడా హుషారు పుట్టించదు. ఫ్లాష్ బ్యాక్ మొదలవడానికి ముందు ఈ పాత్రకు పెద్ద బిల్డప్ ఇస్తారు కానీ.. తీరా చూస్తే ఆ పాత్ర తేలిపోయింది. నీరసం తెప్పించే ఫ్లాష్ బ్యాక్‌లో రొటీన్‌గా సాగే ఉపేంద్ర పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. చాలా ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఉపేంద్రను ఇలాంటి పాత్రలో చూపించాలన్న ఆలోచన ఎలా కలిగిందో ఏమో మరి. దీంతో పోలిస్తే సన్నాఫ్ సత్యమూర్తిలో చేసిన పాత్ర ఎంతో బెటర్. ఇకపై తెలుగులో ఎవరైనా పాత్ర ఆఫర్ చేస్తే ఉపేంద్ర కూడా కాస్త ఆలోచించి చేయడం మంచిది.
This post was last modified on April 9, 2022 11:25 am
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…