మిషన్ ఇంపాజిబుల్.. ఈ వారం రిలీజవుతున్న చిన్న సినిమా. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తున్న సమయంలో ఇలాంటి చిన్న సినిమాను థియేటర్లకు దించడం అంటే సాహసమనే చెప్పాలి. ఇంకే చెప్పుకోదగ్గ సినిమా కూడా ఈ వారం విడుదల కావట్లేదు. ఎవరూ అంత ధైర్యం చేయట్లేదు.
కానీ ఖాళీ దొరికిందనో.. సినిమా మీద నమ్మకమో గానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ మేకర్స్ తమ చిత్రాన్ని ముందు ప్రకటించినట్లే ఏప్రిల్ 1నే థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ట్రైలర్లలో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఒకటి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు స్వరూప్. అలాంటి హిట్ తర్వాత అతను ప్రయత్నిస్తే మీడియం రేంజి హీరోల్లో ఎవరో ఒకరు దొరికేవాళ్లు. కానీ స్వరూప్ మాత్రం ముగ్గురు చిన్నపిల్లల్ని ప్రధాన పాత్రలకు తీసుకుని సినిమా చేశాడు.
ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తాప్సి ఓ ముఖ్య పాత్ర చేసిందీ సినిమాలో. దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే వచ్చే రివార్డు కోసమని ముగ్గురు పిల్లలు ఆపరేషన్‌కు రెడీ అయ్యే నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా సాగే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది ట్రైలర్లో. స్వరూప్ మరోసారి మెప్పించబోతున్నాడనే నమ్మకం కలిగించింది ట్రైలర్.
మరి ఈ మెరుపులు ట్రైలర్ వరకు పరిమితమా.. లేక సినిమాతోనూ అతను అదే స్థాయిలో మెప్పిస్తాడా అన్నది చూడాలి. ఈ నెలలోనే రాబోతున్న భారీ చిత్రం ‘ఆచార్య’ను నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ చిన్న చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి ‘ఆర్ఆర్ఆర్’ ధాటిని తట్టుకుని ‘మిషన్ ఇంపాజిబుల్’ ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.. వారిని మెప్పిస్తుంది అన్నది చూడాలి.
This post was last modified on April 1, 2022 10:40 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…