ఒకప్పుడు బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు చాలా అంతరం ఉండేది. బాలీవుడ్ చాలా గొప్ప అన్నట్లు చూసేవాళ్లు మన వాళ్లు. అక్కడి సినిమాల రేంజే వేరుగా ఉండేది. బాలీవుడ్ దర్శకులు సౌత్ హీరోల వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
అందుక్కారణం ‘బాహుబలి’, ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు సృష్టించిన ప్రభంజనమే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌కూ డిమాండ్ పెరిగింది. ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకూ ఇలాగే నార్త్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభాస్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు తహతహలాడినట్లే.. ఎన్టీఆర్ కోసం కూడా ఆసక్తిని ప్రదర్శిస్తే అతను ఎవరితో సినిమా చేస్తాడన్నది ఆసక్తికరం.
ఈ విషయంలో తారక్ ఆసక్తులేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూయర్. అతను తారక్‌తో చిట్ చాట్ చేసిన సందర్భంగా బాలీవుడ్ దర్శకుల్లో మీ ఫేవరెట్ ఎవరు, మీరు ఎవరితో పని చేయాలనుకుంటారు అని అడిగితే.. రాజ్ కుమార్ హిరాని పేరు చెప్పాడు యంగ్ టైగర్. మనుషుల్లో ఉండే నిజమైన భావోద్వేగాలను హిరాని ఎంతో సరదాగా తెరపై ప్రెజెంట్ చేసే తీరు తనకెంతో నచ్చుతుందని తారక్ చెప్పాడు. అందుకే ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పాడు.
అలాగే సంజయ్ లీలా బన్సాలీ అన్నా తనకెంతో ఇష్టమని.. ఆయన చిత్రాల్లోని భారీతనం తనను ఆకట్టుకుంటుందని చెప్పాడు. నిజానికి బన్సాలీతో తారక్ ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం గతంలోనే జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’తో నార్త్‌లో తారక్ బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో బన్సాలీనో ఇంకో స్టార్ డైరెక్టరో తారక్‌ను త్వరలోనే సంప్రదిస్తే ఆశ్చర్యం లేదు. ఏమో.. తారక్ ఫేవరెట్ డైరెక్టర్ హిరానీనే అతడితో సినిమా చేసే అవకాశముందేమో చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates