సాహో కన్నా RRRకు తక్కువొచ్చింది.. సో??

ప్రస్తుతం నెట్టింట్లో జరుగుతున్న ఒక విస్తృత చర్చ ఏంటంటే.. ఆర్ ఆర్ ఆర్ సినిమాకంటే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకే బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర ఎక్కుగ కలక్షన్ వచ్చిందంట. అందువలన కొందరు అభిమానులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే.. రాజమౌళి, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ కంటే ప్రభాస్ కే ఎక్కువ బాక్సాఫీస్ స్టామినా ఉందంటున్నారు. అయితే ఇలాంటి కంపారిజన్లు ఎటువంటి స్టామినాను తెలియజేయలేవని సదరు ఫ్యాన్స్ కు అర్ధంకావట్లేదు.

మొదటిరోజు వసూళ్ళు చూసుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు కేవలం 19 కోట్ల నెట్ వసూళ్ళు వచ్చాయి. ఇక సామో అప్పట్లో పాతిక కోట్లు వరకు కలక్ట్ చేసింది. సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన 25 కోట్లు నెట్ కలక్షన్లు వచ్చాయంటే.. ప్రభాస్ స్టామినా ఆ రేంజులో ఉందంటూ కాలర్ ఎగరేస్తున్నారు రెబెల స్టార్ అభిమానులు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. సాహో సినిమా పాండమిక్ కంటే ముందు రిలీజైంది. అప్పటికే బాహుబలి 2 సినిమా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ అండ్ హైప్ ఇంకా అలాగే ఉంది. దానికితోడు రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం వలన ప్రభాస్ క్రేజ్ ఆటోమ్యాటిక్ గానే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాహో సినిమాకు రిలీజ్ రోజున 25 కోట్లు రావడం పెద్ద కష్టమేం కాదు.

కాని బాహుబలి వచ్చిన నాలుగేళ్ళకు, అది కూడా హిందీలో ఏమాత్రం ఫేస్ వాల్యూ అనేదే లేని ఇద్దరు కొత్త హీరోలతో (మనకి స్టార్లే కాని వాళ్ళకి కొత్తోళ్లేగా) రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ను ఒక రేంజులో ఓపెనింగ్స్ వచ్చేలా చేయాలంటే ఛాలంజే మరి.

ఇక స్టామినా అదీ ఇదీ అంటే.. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓపెనింగ్ 75 కోట్లు షేర్ వచ్చింది. కాని టిక్కెట్ రేట్లు భారీగా పెంచారుగా అంటారు. ఇకపోతే కేవలం రెండు రూపాయలు మూడు రూపాయలు వంటి రేట్లతో రీమేక్ సినిమా భీమ్లా నాయక్ 100 కోట్ల పైమాట షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది.

మరి రాధేశ్యామ్ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి డిస్కషన్లు పెడుతూపోతే గొడవలే తప్పించి ఎక్కడా ఒక పాయింట్ కూడా తెగదు. అసలు ఒక సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆడుతున్న ఈరోజుల్లో అమీర్ ఖాన్ అయినా అక్షయ్ కుమార్ అయినా మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా.. కంటెంట్ తో కొడితే కాస్త ఎక్కువ వసూలు చేస్తారేమో కాని, కంటెంట్లో లేకుండా వస్తే మాత్రం స్టామినా జీరో అని ప్రూవ్ చేసుకుని వెళిపోతారంతే.