ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రియుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. హిందీలో తక్కువ బడ్జెట్లో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాల మోత మోగిస్తోంది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. అదిరిపోయే టాక్ తెచ్చుకుని వసూళ్ల మోత మోగిస్తోంది. వారం వ్యవధిలోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం దూసుకెళ్తోంది.
ఈ చిత్రానికి అంతకంతకూ స్క్రీన్లు, వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి ఈ చిత్రానికి. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయాడు. ఐతే కశ్మీర్ పండిట్లపై అఘాయిత్యాలను చూపించే క్రమంలో ముస్లింలను దోషులుగా చూపించడంతో అతడిపై ఓ వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే అతడికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం వివేక్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కూడా ఇలాగే కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తమకు అనుకూలంగా సినిమాలు తీసే, మాట్లాడే వారికి మోడీ సర్కారు ఇలా అండదండలు అందిస్తోందన్న చర్చ నడుస్తోందిప్పుడు. ఐతే కంగనా వ్యవహారంతో వివేక్ ఇష్యూను పోల్చడానికి వీల్లేదు. కశ్మీర్ ఫైల్స్ వివాదాలతో కూడుకున్న సినిమా. ఓ వర్గం సినిమా పట్ల, సినిమా తీసిన వారిపై, ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ది కశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాత అయిన వివేక్‌కు వై కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది
This post was last modified on March 19, 2022 9:28 am
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…