పెద్ద హీరోలు ఇమేజ్ ఛట్రంలో పడితే.. దాన్నుంచి బయటికి రావడం చాలా కష్టం. అభిమానులు, మాస్ ప్రేక్షకుల ఆకాంక్షలకు తగ్గట్లే కథలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారీ వాళ్లను మెప్పించే ప్రయత్నమే చేయాలి. ఈ క్రమంలో ఒక మూసలోకి వెళ్లిపోతుంటారు. మాస్ మసాలా సినిమాలే చేస్తూ వస్తుంటారు. వాటికే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం కూడా వస్తుంటుంది. తమిళంలో చాలామంది స్టార్లు ఇప్పుడు ఈ మూసలోనే సాగిపోతున్నారు.
ముఖ్యంగా అజిత్ సినిమా అంటే కొత్తదనానికి ఆమడ దూరంలో ఉంటోంది. అభిమానులకు అతడి మాస్ మసాలా సినిమాలు ఓకే అనిపిస్తున్నా.. కొత్తదనం కోరుకునే వారికి నిరాశ తప్పడం లేదు. మరీ ప్రయోగాలు చేయకపోయినా.. ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేకుండానే కొంచెం కొత్త కథలు ట్రై చేయొచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు అజిత్ అలాంటి సినిమాకే రెడీ అయినట్లుగా కనిపిస్తోంది.‘వలిమై’ దర్శకుడు హెచ్.వినోద్‌తోనే తన కొత్త సినిమాను మొదలుపెట్టేసిన అజిత్.. దీని తర్వాత చేయబోయే సినిమాను విఘ్నేష్ శివన్ చేతుల్లో పెట్టడం విశేషం. నయనతారతో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంటున్న విఘ్నేష్ మొదట్నుంచి కాస్త వైవిధ్యమైన సినిమాలే తీస్తున్నాడు. అతడి సినిమాల్లో కామెడీ భలేగా ఉంటుంది. విజయ్ సేతుపతితో విఘ్నేష్ తీసిన ‘నానుం రౌడీదా’ సూపర్ ఎంటర్టైనర్‌గా గుర్తింపు సంపాదించుకుని బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు అతను సేతుపతి, సమంత, నయనతార కలయికలో చేసిన సినిమా టీజర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇలాంటి దర్శకుడు.. అజిత్ లాంటి హీరోతో సినిమా తీస్తాడని ఎవరూ అనుకోలేదు. ఈ కొత్త కలయికలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో నయనతారే హీరోయిన్ అట. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. మరోవైపు అజిత్.. గురు, ఆకాశం నీ హద్దురా చిత్రాల దర్శకురాలు సుధ కొంగరతోనూ ఓ సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on March 15, 2022 8:41 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…