సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే మిగతా సినిమాల షూట్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది. అవి కాక చేతిలో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. త్వరలో మొదలు కానున్న త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌కి జోడీగా పూజనే నటించబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీలో కూడా తనే హీరోయిన్ అని తేలిపోయింది.
ఈమధ్యనే భీమ్లానాయక్‌గా వచ్చిన పవర్‌స్టార్.. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ కూడా సెట్స్‌కి వెళ్లబోతోంది. ఈ చిత్రంలో పూజని హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ విషయం కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది కానీ అఫీషియల్‌గా ఎవరూ కన్‌ఫర్మ్ చేయలేదు.
అయితే రీసెంట్‌గా రాధేశ్యమ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పూజని దీని గురించి అడిగితే.. ఆ విషయం హరీష్‌ని అడగండి అంది తప్ప నో అని అనలేదు. దాంతో భవదీయుడికి బెస్ట్ హాఫ్‌గా కనిపించబోయేది ఆమేనని హింట్ ఇచ్చినట్టయ్యింది. పైగా ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా మైత్రి మూవీ మేకర్స్‌తో మరోసారి పని చేయబోతున్నానని చెప్పింది పూజ. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది వారే కాబట్టి పూజ చెప్పింది కూడా ఈ సినిమా గురించేనని అర్థమవుతోంది.
పైగా హరీష్‌కి పూజ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే గద్దలకొండ గణేష్‌లో శ్రీదేవి పాత్రకి ఏరి కోరి పూజనే తీసుకున్నాడు. అలాగే పూజకీ హరీష్ అంటే గౌరవం. అతనితో పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పింది. అందుకే ఈ కాంబినేషన్ సెట్టవడం పెద్ద కష్టం కాదు. ఏదేమైతేనేం.. స్టార్ హీరోలందరితో వరుసగా నటిస్తున్న పూజ ఇప్పుడు పవర్‌స్టార్ సరసన కూడా మెరవబోతోంది. ఇది ఆయన అభిమానులకు కిక్ ఇచ్చే వార్తే.
This post was last modified on March 8, 2022 4:37 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…