Movie News

రెండు ఏనుగులు.. మధ్యలో ఒక ఎలుక

టాలీవుడ్లోనే కాదు.. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్‌లో మళ్లీ భారీ చిత్రాల సందడి మొదలైపోయింది. గత వారం తెలుగులో ‘భీమ్లా నాయక్’, తమిళంలో ‘వలిమై’, హిందీలో ‘గంగూబాయి కతియావాడీ’ లాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ మూడూ వాటి వాటి స్థాయిలో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక వచ్చే వారాంతం నుంచి సినీ వినోదం మరో స్థాయికి చేరబోతోంది.

పాన్ ఇండియాలో స్థాయిలో భారీ చిత్రం అయిన ‘రాధేశ్యామ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకో రెండు వారాలకు దాన్ని మించిన ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ రెండు చిత్రాలపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఈ చిత్రాలు రిలీజవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రాలనే నింపేయబోతున్నారు.

ఈ రెండు చిత్రాల స్థాయి, వాటిపై ఉన్న అంచనాల దృష్ట్యా రెంటి మధ్యా రెండు వారాల విరామం ఉండేలా చూసుకున్నారు. వీటి మధ్యలో ఇంకే సినిమా రిలీజ్ చేసినా అది పెద్ద రిస్కే అవుతుంది. ఐతే ఓ చిన్న సినిమా వీటి మధ్య థియేట్రికల్ రిలీజ్2కు రెడీ అవడం విశేషం. ఆ చిత్రమే.. స్టాండప్ రాహుల్. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్, తమిళ అమ్మాయి వర్ష బొల్లమ్మ జంటగా శాంటో అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది.

ఇటీవలే రిలీజైన దీని ట్రైలర్ సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల హడావుడి మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నదే డౌట్. రెండు ఏనుగుల మధ్య చిన్న ఎలుక పిల్ల తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న తరహాలో కనిపిస్తోందీ వ్యవహారం. ఈ స్థితిలో ప్రేక్షకుల దృష్టిలో పడాలన్నా, వారిని థియేటర్లకు రప్పించాలన్నా ‘స్టాండప్ రాహుల్’కు చాలా మంచి టాక్ రావాలి. చూద్దాం ఈ చిత్ర బృందం చేస్తున్న రిస్క్ ఎంతమేర ఫలితాన్నిస్తుందో?

This post was last modified on March 6, 2022 3:24 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

2 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

4 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

4 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

8 hours ago