సమంత రూట్‌లోనే చైతు

తన గురించి తాను పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో నాగచైతన్య కాస్త డల్ అనే చెప్పాలి. మొహమాటం ఎక్కువ. ఎక్కువ చొరవ తీసుకొని చొచ్చుకుపోలేడు. తన పనేంటో తనది అన్నట్టు ఉంటాడు. కానీ విడాకుల తర్వాత తనలో కాస్త మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఇంటర్వ్యూల్లో, ఈవెంట్స్‌లో ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. పైగా ఇప్పుడు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు.

వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న చైతు.. ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి దిగాడు. షోయూ పేరుతో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నేనెప్పుడూ మంచి ఫుడ్ కోసం వెతుకుతుంటాను. ప్రపంచమంతా తిరిగి రకరకాల వంటకాల్ని రుచి చూశాను. కానీ ఏషియన్ ఫుడ్డే నాకు బాగా ఇష్టం. దాన్నే మీకోసం రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన బిజినెస్‌ని పరిచయం చేశాడు.

తనకో మంచి టీమ్ దొరికిందని, వారి సాయంతో మంచి మంచి వంటల్ని రుచి చూపిస్తానని చెబుతున్నాడు చైతు. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చని కూడా చెప్పాడు. తన పోస్ట్‌కి వెంకటేష్ కూతురు ఆశ్రిత రియాక్టయ్యింది. కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా అంటూ విష్ చేసింది. సరిగ్గా చేయడం రావాలే కానీ ఫుడ్ బిజినెస్‌ని మించింది లేదు. పని తప్ప వేరే ధ్యాస ఉండని చైతు అందులోకి దిగాడంటే షోయూని బెస్ట్ బ్రాండ్‌గా నిలబెట్టేందుకు ఫుల్‌ చాన్సెస్ ఉన్నాయి.

నిజానికి సమంతతో కలిసి ఉన్నప్పుడు చైతుని ఆమెతో పోల్చి చూసేవారు కొందరు. ఎందుకంటే సమంత చాలా ఫాస్ట్. మార్కెట్‌లో దూసుకెళ్లడం తనకి బాగా తెలుసు. నిరంతరం లైమ్‌లైట్‌లో ఉండటం కూడా తనకి బాగా తెలిసిన విద్య. ఆ క్రమంలోనే ఓ బట్టల బ్రాండ్‌ కూడా పెట్టింది. చైతు మాత్రం ఎంతసేపూ సినిమాలే తప్ప వేరేవి పట్టించుకునేవాడు కాదు. కానీ తమ దారులు సెపరేట్ అయ్యాక ఇప్పుడు సమంత రూట్‌లో వెళ్తున్నాడు చైతు. బిజినెస్‌మేన్‌గా సక్సెస్ అవుతాడేమో చూద్దాం.