పూనమ్ కౌర్.. ఒక చిన్న స్థాయి హీరోయిన్. ఆమె తెలుగులో కథానాయికగా చేసినవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. నటిగా అయితే ఆమెకు టాలీవుడ్లో పెద్ద గుర్తింపేమీ లేదు. కానీ సినిమాయేతర వ్యవహారాలతో ఆమె పేరు తరచుగా మీడియాలో నానుతూనే ఉంటుంది. ఒక అగ్ర నటుడు, దర్శకుడితో ముడిపెట్టి ఆమె పేరు వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. ఆ నటుడితో ఆమె బంధం మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి.
ఇక సదరు దర్శకుడితో ఆమెకు తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయని.. తన కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఆ దర్శకుడు నాశనం చేశాడని ఆమె బాధ పడుతూ ఉంటుందని చెబుతారు. ఈ విషయమై ఆమె పరోక్షంగా ఆ దర్శకుడిని టార్గెట్ చేస్తూ అప్పుడప్పడూ ట్వీట్లు వేస్తూ ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సెలబ్రెటీల డిప్రెషన్ గురించి పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తనకు ఆ దర్శకుడి మూలంగా ఎదురైన మానసిక సమస్యల గురించి ఇప్పుడు మరోసారి ఇన్ డైరెక్ట్ ట్వీట్లతో ఎటాక్ చేస్తోంది.
సదరు దర్శకుడు తనను సినిమా నుంచి తప్పించాడని.. అలాగే కొన్ని సినిమాల ఆడియో వేడుకల్లో కూడా తాను లేకుండా చేశాడని.. అలాగే తన మీద మీడియాలో నెగెటివ్ ఆర్టికల్స్ రాయించాడని.. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని పూనమ్ అంది. సమస్యను పరిష్కరించుకుందామని తాను అంటే.. వాయిదా వేస్తూ వచ్చాడని.. తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నానని అంటే.. ‘నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఒక రోజు వార్త అవుతావు. అంతకుమించి ఏమీ జరగదు’ అని ఆ దర్శకుడు అన్నట్లు పూనమ్ చెప్పింది.
స్టేజ్ మీద సావిత్రి గారి గొప్పదనం గురించి ఆ వ్యక్తి మాట్లాడతాడని.. కానీ లోకల్ టాలెంటుని ఎప్పుడూ ప్రోత్సహించడని.. పైగా అందరూ అందమైన హీరోయిన్‌గా గుర్తించిన అమ్మాయి తన పని తాను చేసుకోకుండా ఆపడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది పూనమ్. ఆ దర్శకుడికి మంత్రుల కొడుకులు, పెద్ద కుటుంబాల వాళ్లు తెలిస్తే ఏంటని.. అతను కేవలం మ్యానుపులేటర్ అని వ్యాఖ్యానించింది పూనమ్. ఎక్కడా పేరు చెప్పకపోయినా.. ఇదొక ఎడతెగని కథ కాబట్టి పూనమ్ ఎవరిని టార్గెట్ చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.
This post was last modified on June 18, 2020 12:53 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…