బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసకోవడానికి బాలీవుడ్‌లో అతడి పట్ల చూపిన వివక్షే కారణమంటూ ఒక చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వారసులను బాగా ప్రోత్సహించే కరణ్ జోహార్ అండ్ గ్యాంగ్.. సుశాంత్ లాంటి నిజమైన ప్రతిభావంతులను తొక్కి పెట్టేశారంటూ మూడు రోజులుగా అతడితో పాటు కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ విషయమై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ మూవీ మాఫియా ప్రమేయం ఉందంటూ అతడి సొంత రాష్ట్రం బీహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫ్ఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారని ఓజా పిటిషన్లో ఆరోపించారు.
సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్‌లతో పాటు సంజయ్ లీలా భన్సాలీ,ఏక్తా కపూర్, ఇంకో నలుగురి పేర్లను ఓజా పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఎనిమిది మందీ సుశాంత్ సింగ్‌కు మానసిక ప్రశాంతత లేకుండా చేశారని, ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లేలా వ్యవహరించారని ఆరోపించారు. సుశాంత్ సింగ్ కేరీర్ మంచి స్థితిలో ఉందని, మామూలుగా అయితే అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదని.. కానీ అతను సొంతంగా, తమకు పోటీగా ఎదుగుతున్నాడనే కారణంతో అతణ్ని బాలీవుడ్ మూవీ మాఫియా అణచి వేయడానికి ప్రయత్నించిందన్నారు.
సుమారు ఏడు సినిమాల నుంచి సుశాంత్ సింగ్‌ను తప్పించడానికి సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్, కరణ్ జొహార్ కారణం అయ్యారని.. కొన్ని సినిమాలు విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడాన్ని మూవీ మాఫియా జీర్ణించుకోలేకపోయిందని అన్నారు. వారిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఓజా కోర్టును కోరారు.
This post was last modified on June 18, 2020 12:53 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…