ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ.. షార్ట్‌గా చెప్పాలంటే ఐఎస్‌యు. యూరప్ దేశం ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తుంది. అంతరిక్షంలో పరిశోధనలపై విస్తృతంగా పని చేసే సంస్థ ఇది. ఆ సంస్థ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య గురించి తెలిసి అతడికి సంతాపం ప్రకటిస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది.
హిందీ సినిమాలు చేసుకునే నటుడికి ఫ్రాన్స్‌లో ఉన్న స్పేస్ యూనివర్శిటీ ఇలా నివాళి అర్పించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు కారణం లేకపోలేదు. సుశాంత్‌కు సైన్స్ మీద విపరీతమైన ఆసక్తి ఉంది. అంతరిక్షానికి సంబంధించిన విషయాలంటే అతడికి మరీ ఆసక్తి. అతడి సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే స్పేస్‌కు సంబంధించిన పోస్టులు చాలా కనిపిస్తాయి. అతడికి ఆ అంశంలో లోతైన పరిజ్ఞానం ఉందని ఆ పోస్టులు చదివితే అర్థమవుతుంది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సుశాంత్ అంతరిక్షంలో స్థలం కూడా కొన్నాడు. భారతీయ ఫిలిం సెలబ్రెటీల్లో స్పేస్‌లో స్థలం కొన్న ఏకైక వ్యక్తి అతనే. తన జీవితంలో సుశాంత్ నెరవేర్చుకోవాలనుకున్న 50 కలల్లో అంతరిక్ష యానం కూడా ఒకటి కావడం విశేషం. అతను పైన చెప్పుకున్న ‘ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ’తో తరచుగా టచ్‌లోకి వెళ్లేవాడు. అక్కడి పరిశోధనల గురించి తెలుసుకునేవాడు. అతడి ఈ ఆసక్తి గురించి ట్రిబ్యూట్ నోట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. ఇంకో విశేషం ఏంటంటే.. సుశాంత్ స్పేస్ నేపథ్యంలో ఒక భారీ సినిమా కూడా చేయాలనుకున్నాడు.
ఇందుకోసం ఆస్ట్రోనాట్ అవతారంలోకి మారి అంతరిక్ష యానం చేసిన శాస్త్రవేత్తలతో కలిసి కొంత శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ సినిమాను ఓ పెద్ద సంస్థతో కలిసి తనే ప్రొడ్యూస్ చేయాలని కూడా అనుకున్నాడు. 2017లో ఈ ప్రాజెక్టు మీద అతను సీరియస్‌గా పని చేశాడు కూడా. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి యునీక్ క్వాలిటీస్ ఉన్న నటుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం విచారకరం.
This post was last modified on June 17, 2020 1:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…