నటి సురేఖా వాణి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు 18 ఏళ్ల వయసులోనే సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేఖా వాణి.. ఇరవై ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది.
అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో సురేఖ వాణికి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019లో ఆమె భర్త సురేష్ తేజ పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతిచెందారు. ఈ విషాద ఘటన నుంచి తేరుకున్న సురేఖా.. కుతురు సుప్రితను చూసుకుంటూ ఆమెను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి గ్రాండ్‌గా పరిచయం చేయాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలోనే కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచీ సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, సురేఖ మాత్రం ఈ వార్తలను ఖండిస్తూనే వస్తోంది. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రిత.. అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.
ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత.. `రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
This post was last modified on February 27, 2022 1:41 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…