పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్‌గా పవన్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియల్ శేఖర్‌గా రానా అదరగొట్టేశారు.
పవన్, రానాల మధ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, ఊహకు అందని ట్విస్ట్స్ సినిమాను మరో లెవల్‌కి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలోనే సినిమా హిట్ అంటూ సినీ ప్రియులు రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున ప్రదర్శించిన ప్రీమియర్ షోను చూసిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.. సినిమాలో రానాను చూడలేదంటూ `భీమ్లా నాయక్`పై షాకింగ్ రివ్యూ ఇచ్చారు.
`గర్జించే పవన్ కళ్యాణ్ ని చూసి చాలా కాలం అయింది. ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీలకు ప్రత్యేక అభినందనలు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచింది. ఇది తమన్ కెరీర్‌లో బెస్ట్ వర్క్. ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించాను. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భీమ్లాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నేను సినిమాలో రానా ని చూడలేదు. డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను. అంత అద్భుతంగా నటించాడు. దీని తర్వాత ప్రతి ఒక్కరూ “రానా.. నీ ఫ్యాన్స్ వైటింగ్ ఇక్కడ“ అని అంటారు` అంటూ ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ రివ్యూ ఇవ్వగా.. అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
This post was last modified on February 25, 2022 12:46 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…