ఒకప్పుడు తమిళ సినిమాల క్వాలిటీ, వాటిలో కొత్తదనం గురించి దేశమంతా మాట్లాడుకునేది. వేరే భాషల్లో ఆలోచించడానికి కూడా భయపడే కథాంశాలతో తమిళంలో సినిమాలు తీస్తే అక్కడి ప్రేక్షకులు గొప్పగా ఆదరించి తమ అభిరుచిని చాటుకునేవారు. అదే సమయంలో తెలుగులో రొటీన్ మాస్ మసాలా సినిమాలు వస్తుండేవి. వాటిని చూసి తమిళ ప్రేక్షకులు కామెడీ చేసేవాళ్లు.
తమిళం నుంచి కొత్త తరహా సినిమాలు అనువాదమై తెలుగులో రిలీజవుతుంటే మన ప్రేక్షకులు వాటికి అలవాటు పడి వాటిపై ప్రశంసలు కురిపిస్తుండేవారు. కానీ గత కొన్నేళ్లలో ఈ పరిస్థితి మొత్తం తారుమారైంది. మన దగ్గర వినూత్న కథాంశాలతో, అన్ని భాషల ప్రేక్షకులనూ అలరించే సినిమాలొస్తుంటే.. తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయింది. ఇప్పుడక్కడ రొటీన్ మాస్ మసాలా సినిమాలే రాజ్యమేలుతున్నాయి. అవి తెలుగులో రిలీజవుతుంటే మన వాళ్లు తిప్పి కొడుతున్నారు.
పోయిన దీపావళికి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా పెద్దన్న చూసి మనవాళ్లకు చిర్రెత్తుకొచ్చంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమానా అంటూ దాన్ని పూర్తిగా తిరస్కరించారు. తొలి రోజు మ్యాట్నీ నుంచే వెలవెలబోయిందా సినిమా. అలాంటి సినిమాను తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అది అక్కడ బాక్సాఫీస్ హిట్టవడం గమనార్హం. అంతకుముందు రజినీ సినిమాలు దర్బార్, పేటలను మన వాళ్లు తిరస్కరిస్తే అవి తమిళంలో బాగా ఆడాయి. ఇక విజయ్ తీసేవి ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. కానీ అవన్నీ బ్లాక్‌బస్టర్లయిపోతున్నాయి తమిళంలో.
మాస్టర్ లాంటి డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా అక్కడ రికార్డ్ బ్రేకింగ్ హిట్టే. అజిత్ సినిమాల సంగతీ ఇంతే. విశ్వాసం లాంటి మామూలు మసాలా సినిమా అక్కడ ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన వలిమై చూసి తెలుగు ప్రేక్షకులను నిట్టూరుస్తున్నారు. ఇక్కడంతా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. కానీ తమిళంలో ఈ రొటీన్ సినిమాకు 3-4 మధ్య రేటింగ్స్ వేసేస్తున్నారు క్రిటిక్స్. అక్కడి ప్రేక్షకులు కూడా ఆహా ఓహో అంటున్నారు సినిమా చూసి. ఆల్రెడీ ఈ సినిమాను అక్కడ బ్లాక్‌బస్టర్ అంటుండటం గమనార్హం.
This post was last modified on February 25, 2022 7:09 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…