Movie News

భర్త వ‌ల్ల తీవ్ర మ‌నోవేద‌న‌: అతిథి హీరోయిన్

అమృతా రావు.. అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, `అతిథి` హీరోయిన్ అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. బాలీవుడ్‌కి చెందిన ఈ ముద్దుగ‌మ్మ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అతిథి మూవీలో మ‌హేష్ బాబుకు జోడీగా నటించింది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ అవ్వ‌క‌పోయినా.. అమృతా రావు మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.

కానీ, ఆ త‌ర్వాత తెలుగు సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌ని ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టి ప‌లు చిత్రాలు చేసింది. అలాగే మ‌రోవైపు రేడియో జాకీ అన్మోల్ సూద్‌ని ప్రేమించిన అమృతా.. 2016లో అత‌డినే గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ భామకు ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో భ‌ర్త‌తో క‌లిసి `కపుల్ ఆఫ్ థింగ్స్` పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ స్టార్ట్ చేసింది.

ఈ ఛానెల్‌లో త‌ర‌చూ ఏదో ఒక వీడియోను పోస్ట్ చేసే అమృతా రావు.. తాజాగా `ఫ‌స్ట్ ఫైట్‌` పేరుతో ఓ వీడియోను పెట్టింది. ఈ వీడియోలో త‌న‌కు, త‌న భర్త‌కు మ‌ధ్య జ‌రిగిన ఓ పెద్ద గొడ‌వ గురించి అన్మోల్‌తో క‌లిసి చెప్పుకొచ్చింది. అమృతా మాట్లాడుతూ.. `పెళ్లి చేసుకోవాల‌ని ఇద్ద‌రం నిశ్చ‌యించుకున్న త‌ర్వాత ఒక రోజు వ‌చ్చి సినిమాలు మానేయాలని అన్మోల్ చాలా సీరియస్‌గా చెప్పాడు.

ఆ విష‌యం న‌న్ను ఎంత‌గానో బాధపట్టింది. మా బంధం కోసం నేను ఎంతగానో ప్రేమించే నా సినీ కెరీర్‌ను వదిలేయాలా? అనుకుంటూ తీవ్ర మ‌నోవేద‌న‌ను అనుభ‌వించా. రెండు రోజులు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నా. అది తెలుసుకున్న అన్మోల్‌కు గుండె పగిలినంత పనైంది. వెంట‌నే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌  చెప్పి కెరీర్‌ను వదులుకోవాల్సిన అవసరం లేదంటూ అన్మోల్ భ‌రోసా ఇచ్చాడు. అప్పుడు నా మ‌న‌సు కుదుట‌ప‌డింది` అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

This post was last modified on February 24, 2022 1:46 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago