టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను లీక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చిత్రబృందం.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ముందుగా నటుడు శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నారు. దీంతో ఆయనే మెయిన్ విలన్ అయి ఉంటారని అందరూ భావించారు. కానీ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో తమిళనటుడు ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. మహేష్ నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సూర్య. ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా నటించబోతున్నారు.
కథ ప్రకారం.. సినిమాలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. ఏ ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్ గా మధ్య నడిచే సమరమే ఈ సినిమా. నిజాయితీ గల ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలెక్షన్ కమిషనర్ జరిగే వార్, వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ తో సినిమా నడుస్తుందట. మెయిన్ విలన్ ఎస్.జె. సూర్య అయినప్పటికీ.. శ్రీకాంత్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో అంజలి, సునీల్ లాంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని.. డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నింటికి కలిపి దాదాపు 350 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on February 23, 2022 3:37 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…