విల‌న్‌గా న‌టిస్తే బెనిఫిట్స్ అవే అంటున్న `ఆర్ఎక్స్ 100` హీరో!

`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ‌.. ఫ‌స్ట్ మూవీతోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేశాడు కానీ.. `ఆర్ఎక్స్ 100` స్థాయి హిట్టు మాత్రం ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `వలిమై`లో కార్తికేయ విల‌న్‌గా చేశాడు.

ఇదే ఆయ‌న‌కు తొలి త‌మిళ చిత్రం. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ‌తో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మించారు. ఇందులో సీబీసీఐడీ ఆఫీస‌ర్‌గా అజిత్ న‌టించ‌గా.. పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకుతిరిగే కిలాడిగా కార్తికేయ క‌నిపించ‌బోతున్నాడు. ఫిబ్ర‌వ‌రి 24న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. అలాగే విల‌న్‌గా న‌టిస్తే ఎలాంటి బెనిఫిట్స్‌ను పొందొచ్చో కూడా వివ‌రించారు. కార్తికేయ మాట్లాడుతూ.. `హీరో క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్‌ రోల్స్‌కు హద్దులు ఉండవు.

విలన్‌ రోల్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్, మూవీ అవుట్‌పుట్‌, మార్కెట్ ఇలా ఎన్నో టెన్ష‌న్స్ ఉంటాయి. అదే విల‌న్‌కి అలాంటి టెన్ష‌న్స్ ఏమీ ఉండ‌వు` అంటూ స‌ర‌ద‌గా చెప్పుకొచ్చాడు. దీంతో ఆయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న వ‌లిమై చిత్రం మంచి విజ‌యం సాధిస్తే త‌మిళంలో కార్తికేయ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్క‌డం ఖాయమంటున్నారు సినీ ప్రియులు.