Movie News

శ‌ర్వానంద్‌కు మ‌రో త‌ల‌నొప్పి..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్నా తొలిసారి జంట‌గా న‌టించిన చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.  రాధిక, ఖుష్బు, ఊర్వశీ లు లీడ్ రోల్స్ లో క‌నిపించ‌నున్నారు. కుంటుంబ విలువ‌లు, బంధాలు నేప‌థ్యంలో మాంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. కొత్త కొత్త పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌.. ఇలా ఒక్కోటి బ‌య‌ట‌కు వ‌దులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే జ‌రుగుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో `భీమ్లా నాయ‌క్‌` బ‌రిలోకి దిగింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టించిన ఈ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ మూవీకి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. నిత్యా మీన‌న్‌, సంయుక్త‌ మీన‌న్ హీరోయిన్లు న‌టించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.  అయిన‌ప్ప‌టికీ శ‌ర్వానంద్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. చెప్పిన తేదీకే త‌న‌ సినిమాను తీసుకురావాల‌నే ప‌ట్ట‌ద‌ల‌తో.. మ‌రింత జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

అయితే ఇలాంటి టైమ్‌లో శ‌ర్వాకు మ‌రో ఊహించ‌ని త‌ల‌నొప్పి మొద‌లైంది. భీమ్లానాయ‌క్ చిత్రాన్ని సోలోగా విడుద‌ల చేయాల‌ని నిశ్చ‌యించుకున్న నాగవంశి ప‌క్కా ప్లానింగ్‌తో ముందే ఓవర్సీస్, గుంటూరు, వెస్ట్ , ఈస్ట్ పంపిణీ హక్కులను తన ఫ్రెండ్స్‌కు విక్రయించాడ‌ట‌. దీంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి స‌హ‌కారం అంద‌డం లేద‌ని టాక్ న‌డుస్తోంది. ఇదే ఇప్పుడు చిత్ర టీమ్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. మ‌రి శ‌ర్వా ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కి త‌న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాడా..? లేక చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గుతాడా..? అన్న‌ది చూడాలి.

This post was last modified on February 17, 2022 12:15 pm

Share

Recent Posts

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

2 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

3 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

3 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

8 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

10 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

12 hours ago