Movie News

సుశాంత్ జీవితంలో ఈ అమ్మాయిలంతా ఎవరు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక కారణాలు శోధించే పనిలో పడ్డారు పోలీసులు. పోస్టు మార్టం రిపోర్టును బట్టి చూస్తే అతను తనకు తానుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లే తెలుస్తోంది. అతడి గదిలో కొన్ని మందులు దొరికినట్లు చెబుతున్నారు. అవి డిప్రెషన్‌ ట్రీట్మెంట్లో భాగంగా తీసుకుంటున్నవే అని తెలుస్తోంది. అతను ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు. సుశాంత్ కుంగుబాటులో ఉండటానికి కారణం సినీ వ్యవహారాలా.. లేక ప్రేమ వ్యవహారాలా అని పోలీసులు శోధిస్తున్నారు. ఇందులో భాగంగానే సుశాంత్ ప్రస్తుత ప్రేయసిగా చెబుతున్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈమెతో పాటు అంకితా లోఖండే, కృతి సనన్ అనే రెండు పేర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ముగ్గురూ వేర్వేరు సమయాల్లో సుశాంత్‌తో ప్రేమ బంధంలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే మిగతా ఇద్దరమ్మాయిలతో పోలిస్తే సుశాంత్ సీరియస్‌గా ప్రేమలో ఉన్నది.. చాన్నాళ్లు రిలేషన్‌షిప్ నడిపింది అంకిత లోఖండెతోనే అన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. టీవీ సీరియళ్లలో పని చేసే దగ్గర్నుంచి వీళ్లిద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఓ సీరియల్లో కూడా నటించారు. అప్పుడు మొదలైన స్నేహం.. తర్వాత ప్రేమగా మారిందని.. ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారని అంటున్నారు. ఐతే ఏం జరిగిందో ఏమో.. కొంత కాలానికి ఇద్దరూ విడిపోయారు. తర్వాత ‘రాబ్తా’లో కలిసి నటిస్తున్నపుడు కృతి సనన్‌తో అతడికి ఎఫైర్ ఉన్నట్లుగా రూమర్లు వచ్చాయి. కానీ ఇవి ఎక్కువ రోజు నిలవలేదు. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నపుడు వారి గురించి బాలీవుడ్లో ఇలాంటి రూమర్లు వినిపించడం సర్వ సాధారణం. అలాంటి వార్తలు సినిమా ప్రమోషన్‌కు పనికొస్తాయని చిత్ర వర్గాలు కూడా లైట్ తీసుకుంటూ ఉంటాయి. ఇది అలాంటిదే కావచ్చన్న సందేహాలున్నాయి. ఐతే రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్‌గానే ప్రేమలో పడ్డాడని అంటారు. మార్చిలో వీళ్లిద్దరూ కలిసి ఓ జిమ్ బయట కనిపించిన ఫొటో అప్పట్లో వైరల్ అయింది. సుశాంత్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ మీడియా అప్పుడు వార్తలు రాసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఆమెను విచారించే పనిలో పడ్డారు.

This post was last modified on June 15, 2020 11:07 pm

Share
Show comments

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

9 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

11 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

12 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

13 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

14 hours ago