Movie News

రెండుసార్లు షాక్‌.. అయినా మ‌ళ్లీ

కొంచెం స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్ర‌తి హీరో కెరీర్లో ఒక్క‌సారైనా చేయాల‌నుకునే పాత్ర.. పోలీస్‌. మాస్‌ను మెప్పించ‌డానికి దీన్ని మించిన పాత్ర ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. పోలీస్ స్టోరీలు ద‌శాబ్దాల నుంచి భారీ విజ‌యాలు అందుకుంటూనే ఉన్నాయి. ఎంతోమంది స్టార్లు ఈ క‌థ‌ల‌తో భారీ విజ‌యాలందుకున్నారు. యువ క‌థానాయ‌కుల‌కు పోలీస్ స్టోరీల మీద ప్ర‌త్యేక ఆస‌క్తి ఉంటుంది.

కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొని ఆ త‌ర్వాత నిల‌దొక్కుకున్న సుధీర్ బాబు.. ఇప్ప‌టికే వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు, వి చిత్రాల్లో పోలీస్ పాత్ర‌లు చేశాడు. కానీ అవి రెండూ అత‌డికి చేదు అనుభ‌వాలే మిగిల్చాయి. వీర భోగ వ‌సంత రాయ‌లు సినిమా విష‌యంలో అయితే మ‌ధ్య‌లోనే షూట్ అయిపోగానే అత‌ను డ్రాప్ అయిపోగా.. వేరే వ్య‌క్తితో డ‌బ్బింగ్ చెప్పి రిలీజ్ చేశారు.

ఆ సినిమా డిజాస్ట‌ర్ అయింది. ఇక వి కోసం సుధీర్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం లేక‌పోయింది. అయినా అత‌నేమీ పోలీస్ పాత్ర‌ల‌పై ఆస‌క్తి కోల్పోలేదు. ఇప్పుడు సుధీర్ మ‌ళ్లీ ఖాకీ తొడ‌గ‌బోతున్నాడు. మ‌హేష్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో అత‌నో పెద్ద యాక్ష‌న్ సినిమా చేయ‌బోతున్నాడు. ఇందులో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ చూస్తేనే.. ఫుల్ యాక్ష‌న్ అనే విష‌యం అర్థ‌మైపోతోంది. బ్యాగ్రౌండ్లో అంతా గ‌న్నులే క‌నిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించ‌నుంది. ఈ బేన‌ర్లో సుధీర్ ఇంత‌కుముందు శ‌మంత‌క‌మ‌ణి చేశాడు. అది అనుకున్నంత‌గా ఆడ‌లేదు. భ‌వ్య వాళ్లు ఒక ద‌శ‌లో వ‌రుస‌గా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. త‌ర్వాత గ్యాప్ తీసుకున్నారు. సుధీర్ బాబు చిత్రంతో మ‌ళ్లీ ఆనంద్ ప్ర‌సాద్ లైమ్ లైట్లోకి వ‌చ్చారు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్, త‌మిళ హీరో భ‌ర‌త్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ల‌నుంది. మ‌రి మూడో ప్ర‌య‌త్నంలో అయినా సుధీర్ ఖాకీతో హిట్ కొడ‌తాడేమో చూడాలి.

This post was last modified on February 13, 2022 11:04 am

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

24 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

54 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago