మెగా స్టార్ చిరంజీవి దూకుడు.. ఆయన అభిమానులను పూర్తిస్థాయిలో డిఫెన్స్‌లోకి నెట్టేసిందా? వారు ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని తీసుకువచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మెగా అభిమానులు అంటే.. చిరంజీవితో ప్రారంభమైనప్పటికీ.. కేవలం చిరంజీవితోనే వీరు ఎండ్‌కారు. మెగా కుటుంబం నుంచి ఏ నటుడు రంగంలోకివచ్చినా.. జైకొట్టేది.. ఓన్ చేసుకునేది వీరు. చిరు అభిమానులు చిరస్థాయిగా.. తమ అభిమానాన్ని మొత్తం మెగా ఫ్యామిలీపై పంచేసుకున్నారు.
ఈ క్రమంలో చిరు, ఆయన సొదరుడు పవన్ కళ్యాణ్‌పైనా.. చిరు అభిమానులు మనసు పెట్టుకున్న విష యం తెలసిందే. గతంలో ప్రజారాజ్యం పెట్టుకున్నప్పుడు మెగా అభిమానులు రాజకీయ పార్టీ కార్యకర్తలు గా మారిపోయారు. తర్వాత.. ప్రజారాజ్యం పోయినా.. ఆయన వెంటే ఉన్నారు. ఇక, ఈ క్రమంలో తెరమీదికి వచ్చిన జనసేనకు వీరే అభిమానులు అయ్యారు. పవన్ ఎక్కడ ప్రసంగించినా.. జేజే లు కొట్టేది.. సీఎం అవ్వాలని పిలుపునిచ్చేది కూడా మెగా అభిమానులే. ఈ క్రమంలో పవన్ రాజకీయ నేతగా.. ఏపీలో వైసీపీని ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దింపడం కోసమే అన్నట్టుగా పొత్తులకు కూడా పావులు కదుపుతున్నారు. దీంతో పవన్ అబిమాన గణం.. అదే మెగా అభిమానులు అందరూకూడా.. పవన్ బాటలో నడుస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు రెడీ అంటూ.. ఎప్పటికప్పుడు .. పవన్‌కు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా చిరంజీవి.. సీఎం జగన్‌ను మూడు సార్లు కలవడం.. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించడం తెలిసిందే.
దీనిని ఎవరూ తప్పుబట్టడం లేదు. పైగా.. చిరు ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేరు.. వచ్చే అవకాశం కూడా లేదని..ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. దీంతో చిరుజగన్‌ను కలవడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. అయితే.. ఈ క్రమంలో చిరంజీవి.. జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం.. ఆయనకు చేతులు జోడించి నమస్కారం చేయడం.. తల్లిలాంటి వారంటూ.. కొనియాడడం వంటివే మెగా అభిమానులను డోలాయమానంలోకి నెట్టేస్తున్నాయి. ఎందుకంటే..చిరు అంతటి వాడే..ఇలా జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తే.. రేపు పవన్‌కు అనుకూలంగా..జగన్‌కు వ్యతిరేకంగా ఎలా వ్యవహరించాలనేది .. మెగా అభిమానుల ప్రశ్న.
చిరును ఫాలో అయ్యేవారే వీరిలో ఎక్కువగా ఉండడం.. చిరు మాత్రం జగన్‌ను ఫాలో అవుతుండడం.. పవన్ మాత్రం జగన్‌ను వ్యతిరేకిస్తుండడంతో ఎటు వైపు తాము మళ్లాలి.. ఎలా నడవాలి.. ఎవరికి ఫాలో కావాలి?. అనే అంశాలపై.. మెగా అభిమానులు తర్జన భర్జన పడుతుండడం గమనార్హం. మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 12, 2022 8:28 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…