యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో సరదాగా టూర్స్‌కి వెళ్లే ఎన్టీఆర్.. షూటింగ్ లేకపోతే ఇంట్లో భార్య పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. అటువంటి వ్యక్తి కొద్ది రోజుల పాటు ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్`.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించగా.. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కరోనా వ్యాప్తి బీభత్సంగా ఉంది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనేవాడు. అంతేకాదు, కరోనా వల్ల షెడ్యూల్ ఉన్నన్ని రోజులు ఆయన ఇంటికి కూడా వెళ్లేవారు కాదట. ఇద్దరు చిన్నపిల్లలు, భార్య మరియు వయసు పైబడిన తన తల్లి ఉండటం వల్ల షూటింగ్‌లో పాల్గొని తిరిగి ఇంటికి వెళితే వారెక్కడ ఇబ్బందుల్లో పడతారా అని చాలా రోజులు ఎన్టీఆర్ హోటల్‌లోనే ఒంటరిగా గడిపారట.
ఇది కుటుంబ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ.. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డారని టాక్. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. అలియా భట్ హీరోయిన్‌గా నటించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
This post was last modified on February 12, 2022 12:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…