ర‌వితేజ‌తో ఆ ఎక్స్‌పీరియ‌న్స్ అదిరింది: అన‌సూయ‌


అనసూయ భరధ్వాజ్.. ఈమె తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ న‌టిగా త‌న స్థాయిని పెంచుకుంటోంది. తాజాగా అన‌సూయ న‌టించిన చిత్రం `ఖిలాడి`.

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా న‌టించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో అర్జున్ స‌ర్జా కీల‌క పాత్రలో న‌టించారు. అలాగే అన‌సూయ డింపుల్ హ‌యాతికి త‌ల్లిగా `చంద్ర‌క‌ళ‌` అనే పాత్ర‌ను పోషించింది.

ఈమె రోల్ సైతం సినిమాకు బాగానే హైలైట్ కానుంది. ఇక‌పోతే నిన్న హైదరాబాద్ బంజారహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ గ్రాండ్‌గా నిర్వ‌హించారు. అయితే ఈ ఈవెంట్‌లో అన‌సూయ ర‌వితేజ‌తో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అన‌సూయ మాట్లాడుతూ.. `ఖిలాడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో చంద్రకళ క్యారెక్టర్ పోషించడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా.

రవితేజ గారితో క‌లిసి ప‌ని చేయ‌డం అదిరిపోయింది. నేను బాగా ఎంజాయ్ చేస్తూ న‌టించా. ఆయన ఓ బెస్ట్ కో- స్టార్. ఆయ‌న్ను చూస్తే నాకు ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం ఇన్నిరోజులు ర‌వితేజ గారితో ట్రావెల్ చేశాను కానీ ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయా. కానీ ఎప్పటికైనా తెలుసుకుంటా.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.