కర్నాటకలో హిజాబ్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వస్త్రాధారణపై అనుకూల వ్యతిరేక కామెంట్లతో స్థానిక నేతలు మొదలుకొని జాతీయ నాయకుల వరకు తమ వైఖరిని వినిపిస్తుండగా తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ జాబితాలో చేరుతూ సంచలన ట్వీట్ చేశారు.
క్లాస్‌రూంల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటకలో నిషేధం విధించగా విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఎలాంటి దుస్తులు ధరించాలన్నది విద్యార్ధినుల ఎంపికని, రాజ్యాంగం వారికి ఆ హక్కును ప్రసాదించిందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.
బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు.
అయితే, ప్రియాంక ట్వీట్ ను మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిజాబ్ అంశంలోకి బికినీ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు బికినీ వేసుకోవాలని మీరు సూచన చేస్తున్నారా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. అసలు బికినీ అంశం ఎందుకు ప్రస్తావన వచ్చింది? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఇరుకున పడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
This post was last modified on February 9, 2022 7:51 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…