పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పవన్ నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొంతభాగాన్ని చిత్రీకరించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలానే పవన్ తో చర్చిస్తున్నట్లు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే పవన్ క్రిష్ సర్‌ప్రైజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ను చేయిస్తున్నారట క్రిష్. ఈ సినిమా మొఘలాయిల కాలం నాటి కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన సన్నివేశాలు రాయల్ గా ఉండాలని భారీగా ఖర్చు చేస్తున్నారట. ఒక్క గ్రాఫిక్స్ కోసమే రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా పవన్ ను మీట్ అయిన దర్శకుడు క్రిష్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ను చూపించారట. గ్రాఫిక్స్ వర్క్ చూసిన పవన్ సర్‌ప్రైజ్ అయ్యారట. ప్రతి షాట్ ఎంతో క్వాలిటీతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె తప్పించి మరో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on February 8, 2022 8:43 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…