గానకోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ఆస్తులు ఎంతో తెలుసా ? ఆదివారం చనిపోయిన లత ఆస్తులపై ఇపుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గానకోకిల వివాహం చేసుకోకపోవటమే. 65 సంవత్సరాలుగా బాలీవుడ్ కేంద్రంగా లత దాదాపు 60 వేల పాటలు పాడారు. కాబట్టి కచ్చితంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుంటారనటంలో సందేహంలేదు. వివాహం చేసుకోలేదు కాబట్టి వారసులంటు ఎవరు లేరు. అందుకనే ఆమె ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగిపోతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లతా మంగేష్కర్ కు సుమారు రు. 200 కోట్లకు పైగానే ఆస్తులున్నాయట. మరిది రిజిస్టర్ విలువా లేకపోతే మార్కెట్ విలువ అనేది తెలీదు. పెద్ద బంగ్లాళాలు, అపార్టమెంట్లు, ఖాళీ స్థలాలు, బ్యాంకుల్లో ఎఫ్ డీలు, కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాడిన పాటలపైనే ఏడాదికి సుమారు రు. 6 కోట్లు రాయల్టీ వస్తోందట.
లతాకు ఒక సోదరుడు, ముగ్గురు చెల్లెలు ఉన్నారు. వీరిలో ఆశాభోంస్లే కూడా దశాబ్దాలుగా అన్నీ భాషల్లోను పాటలు పాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లత – ఆశాకు ఏ మాత్రం పడదు. సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవట. ఇక మిగిలిన ముగ్గురి కుటుంబాలను లతాయే చూసుకుంటున్నారట. అందుకనే ఇపుడు లత ఆస్తులు ఎవరికి చెందుతాయి ? ఆమె వీలునామా ఏమన్నా రాశారా అనేది కీలకమైంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సంతా పదినాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆమె లాయర్ ఆస్తులు, వారసులు, భాగ పరిష్కారం లాంటి అన్ని వివరాలను ప్రకటించబోతున్నారట. ప్రముఖుల మరణం తర్వాత ఆస్తుల విషయంలో వివాదాలు, భాగ పరిష్కారం లాంటి విషయాలపై జనాల్లో ఆసక్తి ఉండటం సహజమే కదా. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆస్తులపై ఇలాంటి ఆసక్తే పెరిగిపోయింది. చివరకు కోర్టు జోక్యం చేసుకుని సెటిల్ చేసింది లేండి. మరి లత లాయర్ ఏమి చెబుతారో చూడాల్సిందే.
This post was last modified on February 8, 2022 5:46 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…