అరవయ్యొక్కేళ్ల వయసు. మిగతా హీరోలతో పోలిస్తే కాస్త భారీగానే అనిపించే శరీరం. కానీ ఆయన ఎనర్జీ చూస్తే మాత్రం ఇరవైల్లో ఉన్న హీరో కూడా ఈర్ష్య పడాల్సిందే. ఇదంతా ఎవరి గురించి అంటే.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ గురించే. ఆయన వయసులో ఉన్న హీరోలు ఇంకా ఉన్నారు.
వాళ్లూ యాక్ట్ చేస్తున్నారు. కానీ వారందరితో పోలిస్తే ఈయన కరిష్మానే వేరు. తాజాగా మోహన్‌లాల్ నటిస్తున్న ‘ఆరట్టు’ సినిమా ట్రైలర్ రిలీజైంది. దీన్ని చూసి మెస్మరైజ్ కానివాళ్లు లేరు. అయామ్ నాట్ ఎ గ్యాంగ్‌స్టర్.. అయామ్ నాట్ ఎ మాన్‌స్టర్.. అయామ్ సినిస్టర్.. అయామ్ లూసిఫర్ అంటూ గంభీరమైన వాయిస్‌తో డైలాగ్స్ చెప్పడమే కాదు.. యాక్షన్ సీన్స్‌తోనూ అదరగొట్టేశారు లాల్.
ఆ పంచెకట్టులోని అందం.. నడకలోని హుందాతనం.. నవ్వులోని గాంభీర్యంతో పాటు ‘నేను చాలా డేంజరస్’ అంటూ తెలుగులో చెప్పిన డైలాగ్ వహ్వా అనిపించాయి. మోహన్‌లాల్‌కి ఇప్పటికీ ఎందుకింత డిమాండ్ ఉందో ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది.
ఆయన ఎనర్జీ లెవెల్స్ సామాన్యమైనవి కావు. అందుకే ఈ వయసులో కూడా ఒకేసారి ఏడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అఖిల్ ‘ఏజెంట్’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అజిత్ నెక్స్ట్ మూవీలోనూ ఇంపార్టెంల్ రోల్ చేయబోతున్నారు. మొత్తానికి తన దూకుడుతో యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు మోహన్‌లాల్.
Gulte Telugu Telugu Political and Movie News Updates