షారుఖ్ సినిమాలో విక్కీ కౌశల్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా ఆయన షారుఖ్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సోషల్ కామెడీ కాన్సెప్ట్ ను సమ్మర్ లో మొదలుపెట్టాలని చూస్తన్నారు. ఏడెనిమిది నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు రాజ్ కుమార్ హిరానీ. 

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నారట. రాజ్ కుమార్ హిరానీ తన సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేస్తుంటారు. ‘మున్నాభాయ్’ సినిమాలో జిమ్మీ షెర్గిల్, ‘పీకే’ సినిమాలో సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ‘సంజు’లో విక్కీ కౌశల్ ఇలా తన ప్రతి సినిమాలో స్పెషల్ రోల్స్ ను యాడ్ చేశారు. 

ఇప్పుడు షారుఖ్ సినిమాలో కూడా మరో కీలకపాత్ర ఉంటుందట. ఆ పాత్రలో విక్కీ కౌశల్ కనిపించబోతున్నట్లు సమాచారం. నిజానికి ఈ రోల్ కోసం ఒకరిద్దరిని అనుకున్నప్పటికీ రాజ్ కుమార్ హిరానీ మాత్రం విక్కీనే రంగంలోకి దించాలని చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. విక్కీతో హిరానీకి మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఆయన అడిగితే విక్కీ నో చెప్పే ఛాన్స్ లేదు. 

దాదాపు షారుఖ్-విక్కీ కౌశల్ కాంబినేషన్ ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.