హీరోల్ని సినిమాలకు ఒప్పించడం కష్టమైపోతోంది. చేతిలో ఒకట్రెండు హిట్లుంటే.. మరింత బెట్టు చేస్తున్నారు. వాళ్లెవ్వరికీ కథలు ఓ పట్టాన నచ్చడం లేదు. వచ్చిన క్రేజ్ కాపాడుకోవాలి కదా, ఆ మాత్రం జాగ్రత్త అవసరం కూడా.
పీవీపీ దగ్గర ఓ కథ ఉంది. కథంటే సొంత కథ కాదు. ‘ఓ మై కడవులే’ అనే ఓ తమిళ సినిమా రైట్స్ కొనేసింది పీవీపీ. దాన్ని ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించారు. వాళ్లు నో అనేసరికి… విశ్వక్ సేన్ దగ్గరకు చేరింది.
ఇదో యువ జంట కథ. పెళ్లి, విడాకులు.. ఈ విషయంలో ఈతరం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదాన్ని సెటైరికల్‌గా చూపించారు. మధ్యలో దేవుడి వ్యవహారం ఉంటుంది. విజయ్‌సేతుపతి పోర్షన్ ఒక్కటే కాస్త జనరంజకంగా ఉంటుంది. తెలుగులో తీయాలంటే చాలా మార్పులు చేయాలి. అందుకే విశ్వక్ నో చెప్పాడని టాక్.
విశ్వక్‌పై ఆశలు పెట్టుకున్న పీవీపీ… ఇప్పుడు మరో హీరో కోసం అన్వేషణ మొదలెట్టేసిందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates