బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ చాలా ఏళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్నాడు. తానెంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న సుసానె ఖాన్‌తో అతను ఎనిమిదేళ్ల కిందటే విడిపోవడం తెలిసిందే. తన తొలి చిత్రం కహోనా ప్యార్ హై రిలీజైన కొన్ని నెలలకే అతను సుసానెను పెళ్లాడాడు. 14 ఏళ్ల వైవాహిక బంధానికి 2014లో వీళ్లిద్దరూ తెరదించారు. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ.. పిల్లల కోసం తల్లిదండ్రులుగా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నారు. స్నేహితుల్లా మెలుగుతున్నారు. మధ్యలో హృతిక్‌కు కంగనాతో ఎఫైర్ ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. దాని మీద పెద్ద వివాదం నడవడమూ తెలిసిందే. అది తప్పితే హృతిక్ గురించి పెద్దగా ఎఫైర్ వార్తలైతే రాలేదు.
కానీ ఇప్పుడు అతడి జీవితంలోకి కొత్తమ్మాయి ప్రవేశించినట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా.. బాలీవుడ్ మీడియా ఊరికే ఏమీ ఈ ఊహాగానాలు చేయట్లేదు. తాజాగా హృతిక్ ముంబయిలోని ఒక ఫేమస్ జపనీస్ రెస్టారెంట్లో విందుకు హాజరయ్యాడు.
అక్కడి నుంచి బయటికి వచ్చేటపుడు ఒక అమ్మాయి చేయి పట్టుకుని నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం.. తనను హృతిక్ ప్రొటెక్ట్ చేసిన తీరు చూస్తే జస్ట్ ఫ్రెండ్ లాగా అనిపించడం లేదు. మాస్క్ వేసుకుని ఉండటంతో ఆ అమ్మాయిని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆమె సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాదని.. ఆమె హృతిక్ జీవితంలో ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తిగా మారిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ మిస్టరీ గర్ల్ ఎవరో ఏంటో హృతిక్ వివరణ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on January 30, 2022 11:02 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…