కొన్ని జంటలు కలిసి ఒక్క సినిమా చేసినా చాలు.. వాళ్ల పెయిర్స్ ఎప్పటికీ అలా గుర్తుండి పోతుంటాయి. అలా ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన జంట అజిత్-టబులదే. వీళ్లిద్దరూ కలిసి 90వ దశకం చివర్లో ‘కండుకొండేన్ కండుకొండేన్’ (తెలుగులో ప్రియురాలు పిలిచింది) అనే సినిమాలో జంటగా నటించాడు.
ఏస్ సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో పాటు చార్ట్ బస్టర్లయ్యాయి. రెహమాన్ కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. అజిత్-టబుల మధ్య వచ్చే ‘ఏమి చేయమందువే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటుంది. ఆ పాట.. సినిమాలో వారి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పుడు చూసినా మనసును హత్తుకుంటాయి.
అప్పటికి అజిత్ మాస్ హీరో కాదు. ఇలాంటి లవ్ స్టోరీల్లో భలేగా చేసేవాడు. ఇప్పుడంతా మాస్ మాస్ అంటూ ఒక మూసలో సాగిపోతున్నాడు.ఐతే అజిత్-టబు 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి నటించబోతుండటం విశేషం. అజిత్ త్వరలోనే ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఖాకి’ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన సినిమా ఇది. మన యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్‌గా చేశాడు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న చిత్ర బృందం.. మళ్లీ ఓ సినిమా చేయబోతోంది.
అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇందులో అజిత్ మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇది థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందట. ఇందులో అజిత్‌కు జోడీగా టబు నటించనుందట. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించబోతుండటం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. హీరోయిన్‌గా అవకాశాలు ఆగిపోయాక అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్‌తో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది టబు.
This post was last modified on January 29, 2022 6:55 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…