బాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. తిరుగులేని స్థాయికి చేరుకున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. అతడి సినీ ప్రయాణం చాలా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.
హోటల్లో చెఫ్‌గా పని చేసిన కుర్రాడు.. తర్వాత సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకోవడం.. ముందు చిన్న సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడంం.. ఆపై స్టార్ ఇమేజ్ సంపాదించడం.. కాలానుగుణంగా మారుతూ ఘనవిజయాలు అందుకుంటూ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించడం మామూలు విషయం కాదు.
ఇప్పుడు ఇండియన్ ఫిలిం సెలబ్రెటీస్ అందరి కంటే ఎక్కువ ఆదాయం పొందుతూ, అత్యధిక సక్సెస్ రేట్‌తో కొనసాగుతున్న హీరో అక్షయే. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు భారీగా విరాళాలు అందజేస్తూ తన దాతృత్వాన్ని కూడా చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడతను.
ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ జర్నీకి సంబంధించి ఇప్పుడో ఇన్‌స్పైరింగ్ స్టోరీ ట్విట్టర్లో హల్‌చల్ చేస్తోంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో ముంబయిలోని జుహు బీచ్‌కు సమీపంలో అక్షయ్‌కు ఒక అందమైన బంగ్లా నచ్చి అందులోకి వెళ్లి ఫొటో షూట్ చేద్దామనుకున్నాడు. ఐతే దాని గార్డు అతణ్ని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్షయ్ ఆ బంగ్లా కాంపౌండ్ వాల్ మీదే రకరకాల పోజులిస్తూ ఫొటోలు దిగాడు. వాటిని తన పోర్ట్ ఫోలియోలో పెట్టాడు.
ఆ ఫొటోల్ని అలాగే దాచుకున్న అక్షయ్.. కొన్నేళ్ల కిందట తాను ఫొటోల కోసం ముచ్చటపడ్డ బంగ్లాను కొనేశాడు. అది వందల కోట్ల విలువైనది. ఆ బంగ్లాను ఆధునికీకరించిన అక్షయ్.. ఒకప్పుడు తాను ఫొటోలు దిగిన ప్రహరీ గోడను అందంగా తీర్చిదిద్దుకున్నాడు. దాని మీద స్టైల్‌గా పడుకుని ఫొటోలు కూడా దిగాడు. ఈ రెండు ఫొటోల్ని కలిపి చూస్తే అంతకుమించిన ఇన్‌స్పైరింగ్ స్టోరీ మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు.
This post was last modified on June 13, 2020 2:27 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…