Movie News

భీమ్లా నాయ‌క్‌.. ఆశ‌లు పెట్టుకోవ‌చ్చు

కొన్ని వారాల నుంచి సినీ ప్రేమికుల‌కు వ‌రుస‌గా చేదు గుళిక‌లే అందుతున్నాయి. దేశంలో కొవిడ్ కేసులు మ‌ళ్లీ అమాంతం పెరిగిపోయిన నేప‌థ్యంలో సంక్రాంతి సీజ‌న్లో రిలీజ్ కావాల్సిన‌ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్ర‌మే కాదు.. ఫిబ్ర‌వ‌రి తొలి రెండు వారాల్లో రావాల్సిన ఆచార్య, మేజ‌ర్ లాంటి క్రేజీ మూవీస్ వాయిదా ప‌డిపోయాయి.

ఈ జాబితాలో మ‌రిన్ని సినిమాలు చేరుతున్నాయి. దీంతో భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డ‌టం ప‌క్కా అని అంతా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ముదుగా జ‌న‌వ‌రి 12కు షెడ్యూల్ అయిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 25కు వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్ధంలో రావాల్సిన‌ ఆచార్య‌, మేజ‌ర్ సినిమాలను వాయిదా వేశారంటే.. రెండో అర్ధంలో రావాల్సిన భీమ్లా నాయ‌క్ మాత్రం ఎందుకు వాయిదా ప‌డ‌కుండా ఉంటుంద‌న్న‌ది జ‌నాల ఆలోచ‌న‌.

కాబ‌ట్టి వీటి నిర్మాత‌ల బాటలోనే.. భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ కూడా వాయిదా స్టేట్మెంట్ ఇవ్వ‌డం లాంఛ‌న‌మే అనుకుంటున్నారు. కానీ భీమ్లా నాయ‌క్ టీం మాత్రం ఫిబ్ర‌వ‌రి రిలీజ్ డేట్‌కు క‌ట్టుబ‌డే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో వాళ్లేమీ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించ‌ట్లేదు. కొవిడ్ కేసులు వ‌చ్చే ప‌ది రోజుల్లో పీక్స్‌ను అందుకుని.. ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌న్న‌ది నిపుణుల అంచ‌నా. ఈ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌కు వ‌చ్చేస‌రికి క‌రోనా ఉద్ధృతి బాగా త‌గ్గుతుంద‌ని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్ర‌వ‌రి 25న సినిమా విడుద‌ల‌కు పెద్ద ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. పుష్ప త‌ర్వాత భారీ చిత్రాలేవీ లేక రెండు నెల‌ల పాటు నిరాశ‌లో ఉన్న ప్రేక్ష‌కులు.. భీమ్లా నాయ‌క్ రిలీజైతే ఎగ‌బ‌డి చూస్తార‌ని.. బాక్సాఫీస్‌కు కూడా మంచి ఊపొస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంద‌ట‌. ఐతే ఒక్క విష‌యంలో మాత్రం భీమ్లా నాయక్ టీంలో భ‌యం ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అస్స‌లు ప‌డ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఉద్దేశ‌పూర్వ‌కంగా థియేట‌ర్ల మీద ఆంక్ష‌లు కొన‌సాగిస్తారేమో.. వేరే ర‌కంగానూ ఇబ్బంది పెడ‌తారేమో అన్నదే ఆందోళ‌న‌.

This post was last modified on January 26, 2022 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

55 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

55 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago