Movie News

నాని ‘దసరా’.. ఒక్క సెట్ కోసం అన్ని కోట్లా..?

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘దసరా’ సినిమాపైనే ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు నాని. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ వేస్తున్నారట. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా నాని సినిమా మొత్తం బడ్జెట్ ముప్పై కోట్లలోపే  ఉండేలా  చూసుకుంటారు. అలాంటి ‘దసరా’ సినిమాలో ఒక్క సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ లో చాలా భాగం ఈ విలేజ్ సెట్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

This post was last modified on January 25, 2022 7:42 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago